తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలో రానిస్తున్నారని, ఐ.ఏ.ఎస్, ఐ.ఎఫ్.ఎస్ అధికారులుగా వివిధ హోదాలలో ఉంటూ ప్రతిభ కనబరుస్తున్నారని అధైర్య పడరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రాస్ కార్యాలయంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిబావంతుల దినోత్సవ వేడుకలు 2022 జే.సి అద్యక్షతన జరిగింది. జే.సి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలో రానిస్తున్నారని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, రుణాలను అందుకొని ముందుకెళ్ళాలని అన్నారు. చాలా చోట్ల విభిన్న ప్రతిభావంతులు తమ పనిలో అధికారులుగా ఇతర అధికారుల కన్నా ప్రతిభ చూపిస్తున్నారని కొనియాడారు. ఈ సమావేశంలో అర్హత గల వారికి ల్యాప్ ట్యాప్ లు 3, టచ్ ఫోన్ లు 4, రూ. లక్షా 80 వేల విలువ గల పరికరాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖాధికారి శ్రీనివాస్, పి.డి.డి.ఆర్.డి.ఏ జ్యోతి, డిప్యూటి ఈ.ఓ ఆనంద రెడ్డి, రాస్ జనరల్ సెక్రటరీ వెంకటరత్నం, ఆర్.సి.పురం ఎం.పి.టి.సి.రాజేష్, విభిన్న ప్రతిభావంతులు వారి సహాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News