డిసెంబర్ 15 న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి ని డిసెంబర్ 15 వ తేదీన రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, రెవెన్యూ, మండల స్థాయి అధికారులు తగిన రీతిన డిసెంబర్ 15 గురువారం అమరజీవి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠాశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తదితర ప్రాంతాల్లో నిర్వహించాలనీ కలెక్టర్ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగిన పద్దతిలో వర్ధంతి రోజున తగిన రీతిన నివాళులు అర్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీసు అధికారులు, ఆర్డీవో లు, స్కూల్స్ , ఇంటర్మీడియేట్ కళాశాలకు విద్యా అధికారులు, మునిసిపల్ తదితర అధికారులు వారి సంస్థలలో కార్యాలయాల్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాలని తెలియచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *