-స్థిరంగా పనిచేసే నాణ్యమైన డ్రోన్ లను సరఫరా కొరకు వ్యవసాయ శాఖ తీసుకునే చర్యలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించుటకు వ్యవసాయ డ్రోన్ పరికరాలు ఉపయోగించి రైతు ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం 2024-25 సం లొ 875 గ్రామాల్లో రూ.10.00 లక్షలు యూనిట్విలువతో80% వరకుసబ్సిడీపై,50% బ్యాంకు ఋణ సహాయంతో వ్యవసాయ డ్రోన్ లతోగ్రామ స్టాయి యాoత్రీకరణ కేంద్రాలురు.70 కోట్లతో రాయితీ సొమ్ముతో ఏర్పాటు చేయదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నది.
ఈ కేంద్రాల ఏర్పాటు కు అన్ని జిల్లాల్లోని వాణిజ్య పంటలు, పిచికారీ ఎక్కువగా అవసర మయ్యే పంటలు మరియు ఒకే పంట ఎక్కువగా పండించే మండలాలల్లో ప్రాధాన్యతననుసరించి ఎంపిక చేసిన ఆర్.స్.కే పరిధి లోని గ్రామాల్లో భూమి కలిగి వ్యవసాయం చేస్తూ ఈ కేంద్రం ద్వారా బాడుగ పై యంత్రసేవలు అందిస్తూ ఆదాయం సంపాదించడానికి ఉత్సుకత కలిగిన 4-5 రైతులతో రైతుసంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఈ డ్రోన్లు కొనుగోలుకు ఆర్ధిక సహాయం కోసం ఋణ సదుపాయను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం (ANGRAU), కార్యక్రమం అమలుకు అవసరమైన సాంకేతిక సహాయాన్నిఅందిస్తోంది.
ఇంత అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు ఇవ్వబోయేటప్పుడు దాని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన మరియు స్థిరంగా పనిచేసే డ్రోన్ లను రైతులకు అందజేయడానికి ప్రభుత్వం వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలొ ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఎర్పాటు చేసింది. ఈ కమిటి నాణ్యమైన డ్రోన్ యూనిట్లను రైతులకు అందజేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది.దీనిలో బాగంగా అర్హత కలిగిన కంపనీలు DGCA దృవీకరించిన డ్రోన్ మోడల్స్ ను నమోదు కై వ్యవసాయ శాఖను కోరడం జరిగింది.నోమోదు కోరిన డ్రోన్లను – వ్యవసాయ శాఖ అధికారులు,ANGRAU శాస్రవేత్తలు, మరియు డ్రోన్ కార్పొరేషన్ సాంకేతిక అధికారులతో కూడిన సాంకేతిక కమిటీ ద్వారా ANGRAU, LAM, గుంటూరు నందు పరిశీలించి పరీక్షించడం జరుగుతున్నది.
డ్రోన్లకు భారత ప్రభుత్వ (DGCA)జారీ చేసిన ప్రతేక గుర్తింపు సంఖ్య ను, TYPE సర్టిఫికేట్ ప్రకారం వివిధ ప్రామాణికాలను, బ్యాటరీలను, ఇన్సూరెన్స్ వివరాలు పరిశీలించడం తో పాటు, పొలం లో వుండే వివిధ పరిస్థితులలో డ్రోన్ పిచికారీ చేసే పనితీరు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
పంట మీది నుంచి రెండు అడుగులమరియు మూడు అడుగుల ఎత్తులో స్థిరంగా పిచికారీ చేయడాన్ని; పొలాల్లో చెట్లు,కరెంటు పోల్స్ , కరెంటు తీగలు మొదలగు అడ్డంకులు వున్నప్పుడు పనితీరు; పొలంలో పిచికారీ కొరకు మాప్పింగ్ చేసే విధానం;మరియు మాప్పింగ్ పరిధిలో పిచికారీ చేసే విధానం;ఒక బ్యాటరీ చార్జింగ్ తో ఎన్ని ఎకరాలు పిచికారీ చేయబడుతున్నది; బ్యాటరీ లేదా నీళ్లు అయిపోయిన పరిస్థితులలో యధాస్థితికి తనంతట తానే వచ్చి ల్యాండ్ అయ్యే విధానం; పది లీటర్ల ద్రావకం తో ఎకరం పిచికారీ చేయగలిగే విధానం;పంట మీద స్థిరమైన ఎత్తులో సమానంగా ప్రయాణం చేసి ఏక రీతిగా మందు పిచికారి చేసే విధానం; ఒక రోజులో కనీసం 20 ఎకరాలు పిచికారీ చేసే సామర్ధ్యం ; మొదలగు ప్రామాణికాలను పరీక్షించి, పరిశీలించిన మీదట సాంకేతిక కమిటీ , రాష్ట్ర స్థాయి కమిటీకి పూర్తి నివేదికను అందించనుంది.
వీటి పనితీరును రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి, స్థిరంగా చాల కాలం పనిచేసే నాణ్యమైన డ్రోన్లను నమోదు చేసిన పిమ్మట, రైతు గ్రూపులు వారి అభీస్టం మేరకు డ్రోన్ మోడల్ ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకోవడానికి వీలు కల్పించడం జరుగుతున్నది. తద్వారా వ్యవసాయ డ్రోన్ పరికరాలు ఉపయోగించి వ్యవసాయ పెట్టుబడులను తగ్గించి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించి రైతు ఆదాయాన్ని పెంచడానికిగ్రామ స్టాయియాoత్రీకరణ కేంద్రాలు విజయవంతంగా పని చేయడానికిప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.