విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర( ఎఫ్ టామ్ ) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రమునందు 16 మార్చ్ 2025 న జరిగిన వారధి కార్యక్రమమునందు డాక్టర్ మాకాల సత్యనారాయణ యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ కు ఎఫ్ టామ్ ఎక్స్లెన్స్ అవార్డు ను సినీ యాక్టర్ సుమన్ తల్వార్ మరియు ఎఫ్ టామ్ అధ్యక్షుడు గజ్జల జగన్ బాబు చేతులు మీదగ అందించారు.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, మహారాష్ట్రలో నివసిస్తున్న తెలుగువారి సాంస్కృతిక,కమ్యూనిటీ మరియు వ్యాపార సహకారం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్దేశింపబడినది.ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ మాతృభాషను వదలటం అంటే తల్లిదండ్రులను మరవటమే,మాతృభాషతోనే వ్యక్తి వికాసం, సమాజ వికాసం బాగుంటుందని అని తెలిపారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ 22 సంవత్సరాలుగా మందులు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్టు లేకుండా విరిగినవి, తెగినవి మరియు కుళ్ళునవి కాకుండా అన్ని రకాల అనారోగ్యాలను ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ మరియు యోగశక్తి చికిత్స విధానాలతో వేల మందికి వైద్యము మరియు శిక్షణ ఇచ్చినందుకు మరియు ఈ విధానం కేంద్ర ప్రభుత్వం గుర్తింపు తెచ్చినందుకు ఈ అవార్డు వరించిందని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యుడు డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు కొనియాడారు.
