Breaking News

శాసనసభ్యులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో విజయకేతనం

అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభ్యులకు నిర్వహించిన ప్రత్యేక క్రీడా పోటీల్లో భాగంగా,  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వాలీబాల్ పోటీలో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో స్పీకర్ కెప్టెన్‌గా ఉన్న “స్పీకర్ టీం” 25 పాయింట్లు సాధించి విజయం సాధించింది, హోం మినిస్టర్ టీం 20 పాయింట్లతో నిలిచింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు  యువకుల తరహాలో మైదానంలో చురుకుగా కదలాడి, ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యత చూపించారు. వాలీబాల్ ప్లేయర్‌గా గతంలో మంచి అనుభవం కలిగిన స్పీకర్, అదే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తన జట్టుకు గెలుపును అందించారు. ఈ క్రీడా పోటీలు శాసనసభ సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలు ఉత్సాహంగా సాగిన ఈ సందర్భంగా, గెలుపొందిన స్పీకర్ టీం సభ్యులకు అభినందనలు వెల్లువెత్తాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *