Breaking News

వర్గీకరణకు క్యాబినెట్‌ మరియు అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎంకు ధన్యవాదాలు…

-ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్గీకరణకు క్యాబినెట్‌ మరియు అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాదిగ జాతి పక్షాన ఎమ్మార్పీఎస్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. మంగళవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు రాజీవ్‌ మిశ్రా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఏకసభ్య కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 4 వేల మంది నుంచి వినతిపత్రాలు స్వీకరించింది. అన్ని మాల, మాదిగ సంఘాలతో సమావేశాలు నిర్వహించింది. మాల, మాదిగ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలూ స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక అందించింది. గతంలో రామచంద్ర కమిషన్‌ వేసి సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. దీంతో అప్పట్లో 25 వేల మందికి మాదిగ, మాదిగ ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు దక్కాయి అన్నారు. భవిష్యత్తు కార్యచరణను చర్చించుటకు అత్యవసరంగా ఈ నెల 21న ఎమ్మార్పీఎస్‌ ఉద్యమ పురిటిగడ్డ మాదిగల పోరాట క్షేత్రం ఈదుమూడిలో అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్లు మానికొండ శ్రీధర్‌ మాదిగ, పానుగంటి షాలెం రాజు మాదిగ, ఏటుకూరి విజయకుమార్‌ మాదిగ, గుండాల ఆనంద్‌ మాదిగ, కొమరోల శ్రీనివాస్‌ మాదిగ, లంకా బుజ్జమ్మ మాదిగ, చంద్రలీల మాదిగ, జయరాజ్‌ మాదిగ, మనోజ్‌ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *