Breaking News

ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి…

-పిఆర్సి చైర్మన్ ని వెంటనే నియమించాలి.
-పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి.
-జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఎ. విద్యాసాగర్ ఏకగ్రీవ ఎంపిక.

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ఎన్జీజీవో సంఘం ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.వి. శివారెడ్డి అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు తదితర అంశాలు మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపి ఎన్జీజివో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ ను రాష్ట్ర జెఎసి డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు.
అనంతరం
గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అంశాల మీద దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వంతో ఇప్పటివరకు సామరస్య పూర్వకంగా వివరించిన తమ ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం తమ సమస్యలపై ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తుందేమోనని ఎదురు చూసామన్నారు. ప్రభుత్వం వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లలో అసంతృప్తికి దారితీస్తుందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళవలసిన ముఖ్యమైన అంశాలు వంటి వాటిపై జేఏసీ సెక్రటేరియట్ సమావేశంలో చర్చించామన్నారు. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని, ఉద్యోగులను కూడా ప్రజలలో భాగంగా గుర్తించాలన్నారు. వారి సమస్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిమ్మట ఒకటవ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించడం తప్పితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు కలగలేదని తెలిపారు. ఇంతకుమించి ఇంకొక అడుగు కూడా పడలేదన్నారు.
ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అలపర్తి విద్యాసాగర్ మాట్లాడుతూ వేతన సవరణ గడువు జులై 2023 నుంచి మొదలు కావాల్సి ఉండగా గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని నియమించారని, కానీ వేతన సవరణ కమిటీ చైర్మన్ గత సంవత్సరం రాజీనామా చేసినప్పటికీ, గడువు ముగిసి రెండు సంవత్సరాలు కావస్తున్నాయని, ఇంతవరకు పిఆర్సి కమిటీ చైర్మని నియమించకపోవడం శోచనీయం అని, వెంటనే పిఆర్సి కమిటీ చైర్మన్ నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు తీరని నష్టం జరిగిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25 వేల కోట్ల రూపాయలు బకాయిలను మిగిల్చి వెళ్లిందని, ఏపీ జిఎల్ఐ సంబంధించి ఉద్యోగుల డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకొని ఉద్యోగులకు చెల్లింపు చేయకపోవడం వలన ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదని కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే జిపిఎఫ్ / సరెండర్ లీవ్ బకాయిలు సంక్రాంతికి విడుదల చేశారని వివరించారు.
జిపిఎఫ్/ఏపీ.జి.ఎల్.ఐ/సరెండర్ లీవ్ ల బకాయిల చెల్లింపు విషయములో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, బకాయిల త్వరితగతిన చెల్లించాలని, బకాయిల చెల్లింపులపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా జి.పి.ఎఫ్/ఏపి.జి.ఎల్.ఐ లో ప్రభుత్వం డబ్బు ఒక్క రూపాయి కూడా లేదన్నారు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యమేనన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయిల ఉద్యోగులు దాచిపెట్టుకున్న సొమ్ము ప్రభుత్వం దగ్గర వుందని, పదవీవిరమణ మరియు రుణ మంజూరుపై నిధులు విడుదల చేయక పోవడం దురదృష్టమని తెలిపారు.
పదవి విరమణ చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని 30 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడంలేదని కనీసం ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితులలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ, డిపార్ట్మెంట్ చుట్టూ తిప్పించుకోవడం భావ్యం కాదని వారికి ప్రాధన్యత క్రమంలో చెల్లించాలని కోరారు.
ఏపీ. జి.ఎల్. ఐ లో 1100 కోట్ల రూపాయిల బకాయిలు ఉన్నాయని, ఈ సంవత్సర కాలంలోనే 1200 కోట్ల వరకు ఉద్యోగులు ప్రభుత్వానికి చెల్లించారని, 14000 కోట్లు ఉద్యోగుల మూలధనం ప్రభుత్వం వద్ద ఉన్నారని, ఉద్యోగి చనిపోయిన డబ్బులు వచ్చే పరిస్థితి లేదని, ఇటువంటి దురదృష్టకర పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి తక్షణమే చెల్లింపులకు మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు. ఏపీ జెఎసి సెక్రటరీ జనరల్ కె ఎస్ ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ
ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన డి. ఎ., రాష్ట్ర ప్రభుత్వం కూడా మంజూరు చేయాల్సి ఉందని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక, పెండింగ్ లో ఉన్న (01.01.2024, 01.07.2024, 01.01.2025) మూడు విడతల డి.ఏ లలో కనీసం ఒక్క విడత డి. ఏ. కూడా విడుదల చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో కరువు భత్యాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ల పి. ఆర్. సి. బకాయిల చెల్లింపు, డి.ఏ మంజూరు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం వలన ఉద్యోగులు తీవ్ర
అసంతృప్తితో ఉన్నారని, ఉద్యోగ సంఘాలపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరిస్తుందని ఆశాభావంతో ఉన్నామన్నారు.
ఈ సమస్యలన్నీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పరిష్కారానికై ఒత్తిడి తేవాలని జేఏసీ తీర్మానించినట్లుగా పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, ఔట్సోర్సింగ్, గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదించేందుకు సెక్రటేరియట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
12వ పిఆర్సి కమిషనర్ ను వెంటనే నియమించాలని, పి ఆర్ సి అమలు అయ్యేలోపు 29% ఐ ఆర్ ప్రకటించటం,
జిపిఎఫ్, ఏపీజిఎల్ఐ, సరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లింపులు, పేరుకుపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపునకై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న డి.ఏలను మంజూరు చేయాలని కేంద్ర పభుత్వ మెమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004 ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన ఉద్యోగ ఉపాధ్యాయలకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలి. కూటమి ప్రభుత్వ హమికి అనుగుణంగా సిపిఎస్ రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి. రిటైర్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటి, కమ్యూటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
గురుకుల ఉద్యోగులకు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, మోడల్ స్కూల్, ఎంటీఎస్ పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు.
2014కి ముందు నియమించబడి రెగ్యులరైజ్ కానీ 7000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలనీ, పంచాయతి రాజ్ డిపార్టుమెంటు, తదితర శాఖలలో పెండింగ్ లో ఉండిపోయిన కారుణ్య నియామకాలకు పరిష్కరం చూపేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
11వ పి ఆర్ సి లో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ను పునరుద్దరించాలి.
గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ డిపార్టుమెంటు లో గత 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను సంస్థ నిబంధల ప్రకారం అమలుచెయ్యాలనీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కోస్ ద్వారా సేవలు కొనసాగించాలని, ఆప్కోస్ సంస్థను మూసివేస్తారని వస్తున్న ప్రచారంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు
వైద్య ఆరోగ్యశాఖలో తొలగించబడిన ఎంపిహెచ్ఎ లను తిరిగి సర్వీస్ లోకి తీసుకోవాలన్నారు.
సమావేశంలో కో చైర్మన్లు ఎం. రఘునాథ్ రెడ్డి
(ఎస్టీయు), జి హృదయ రాజు (ఏపిటిఎఫ్1938), డి. చంద్రశేఖర్ (ఏపీ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్), వై. శ్రీనివాసరావు( ఏ పి పి టి డి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్), ఎన్. చంద్రశేఖర్ ఆల్ ఏపీ గవర్నమెంట్ క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ సెంట్రల్ అసోసియేషన్), సిహెచ్. మంజుల ఏపీటీఎఫ్(257), జేఏసీ సెక్రటేరియట్ వైస్ చైర్మన్లు పివి. సాయికుమార్ (ఏపీ అగ్రికల్చరల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్), వి. రాకేష్ మధుకర్ బాబు
(ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్), కే రామారావు (ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగం ఉద్యోగుల అసోసియేషన్), శోభన్ బాబు (ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్), ఎస్. రాధమ్మ ( ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్), సిహెచ్ శ్రీనివాసరావు (ఏపీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసోసియేషన్), అసిస్టెంట్ సెక్రటరీ జనరల్స్ ఆర్ఎస్ హరనాథ్ ( పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ ఎంప్లాయిస్ అసోసియేషన్), బి. నరసింహులు (ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్), ప్రచార కార్యదర్శి బి. జానకి ( ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), కార్యదర్శులు ఎస్. విద్య (ఏపీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్) ఎస్ ఎల్ సోమయాజులు (ఏపీ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్), ఎం. శ్రీనివాసులు (ఏపీ ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల నిర్వహణ ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్), బి. సేవా నాయక్ (ఏపీ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీస్ ఫెడరేషన్), వేణు మాధవరావు (ఏపీ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్) తోట కృష్ణ కిషోర్ (ఏపీ ఐటిఐ అండ్
డిఎల్టి స్టాఫ్ అసోసియేషన్), జానీ పాషా షేక్ ఎండి (గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం), కే. ప్రకాశరావు (ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్), కోశాధికారులు ఏ. రంగారావు (ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), జి. ప్రభుదాసు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్), సి.ఎం.దాస్( ఏపీ సిపిఎస్ఈఏ) తదితరులతోపాటు రాష్ట్రస్థాయిలో వివిధ పదవులు నిర్వహిస్తున్న పలువురు నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *