గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ అన్నారు. శనివారం ” స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర ” లో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయం జరిగిన స్వఛ్చత కార్యక్రమాలలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ తేజ , జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి తో కలసి పాల్గొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ అధికారులు, ఉద్యోగులతో కలసి కలెక్టరేట్ ప్రాంగణంలో చెత్త, వ్యర్ధాలను తొలగించి, పరిసరాల శుభ్రం చేశారు. పౌర సరఫరాల కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యాలయాలను, పరిసర ప్రాంగణాలను శుభ్రంగా ఉండేలా అధికారులు ప్రణాళిక ప్రకారం స్వచ్చత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పూర్ణ చంద్రరావు, మత్స్య శాఖ డిడి గాలిదేముడు , డీపీఓ సాయికుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీందర్, జిల్లా భూగర్భజలవనరుల శాఖ ఉప సంచాలకులు వందనం, కలెక్టరేట్ సెక్షన్ సూపరిండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
