గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషన్ వారు గ్రూప్ -II సర్వీసెస్ (నోటిఫికేషన్ నం. 11/2023) ఉధ్యోగముల నియామకము నకు సంబంధించిన మెయిన్స్ పరీక్ష నిర్వహణ సమర్దవంతముగా జరుపుటకు జిల్లా జాయింటు కలెక్టరు వారు & కో ఆర్డినేటింగ్ అధికారి ఏ భార్గవ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి తో కలసి సోమవారం సంయుక్త కలెక్టర్ చాంభర్ లో లైజను ఆఫీసర్ల తో సమావేశము నిర్వహించినారు. ఈ సంధర్భంగా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషన్ వారు గ్రూప్ -II సర్వీసెస్ (నోటిఫికేషన్ నం. 11/2023) ఉధ్యోగముల నియామకము నకు సంబంధించిన మెయిన్స్ పరీక్ష ది.23.02.2025న (ఆదివారం) ఉదయం 10.00 గం. ల నుండి 12.30 గం. ల వరకు(Paper-I) మరియు మధ్యాహ్నం 03.00 గం. ల నుండి 05.30 గం. ల వరకు(Paper-II) పరీక్షను నిర్వహిస్తున్నారన్నారు. గుంటూరు జిల్లా నందు 11పరీక్ష కేంద్రములలో పరీక్షలు నిర్వహించుచున్నారని, ఈ పరీక్షకు 9,277అభ్యర్దులు హాజరు అగుచున్నారన్నారు. జిల్లా లోని 11 పరీక్ష కేంద్రములకు 11మంది సీనియర్ జిల్లా అధికారులను లైజను ఆఫీసర్లు గా నియమించి యున్నామన్నారు. సమావేశము నందు పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లుపై లైజను ఆఫీసర్లకు తగు సూచనలను జారీ చేసి ప్రతి అధికారిని తమకు కేటాయించిన పరీక్ష కేంద్రమును సందర్శించి అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ మరియు వారి సిబ్బంది తో సమావేశము ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణ సజావుగా జరిపించేందుకు తీసుకొనవలసిన జాగ్రత్తలు తెలియపరచ వలసినదిగా తెలుపడమైనది. తిరిగి 21.02.2025 న APPSC అధికారుల తో, పరీక్ష కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ లతో, లైజను ఆఫీసర్లు, పోలీసు, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో తిరిగి సమావేశము జరుగును అని తెలియపరచడమైనది.
