గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ ద్వారా గుంటూరు నగరంలో పారిశుధ్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నామని, అందులో భాగంగా వార్డు సచివాలయాల వారీగా సూక్ష్మప్రణాళిక సిద్దం చేశామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు. స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బ్రాడిపేట 5వ లైన్ నుండి సీనియర్ సిటిజెన్స్, జిల్లా జైలు అధికారులు, ట్రెజరీ అధికారులతో కలిసి స్వచ్చతా ర్యాలీ, తాలూకా పరిసరాలలో మాస్ క్లీనింగ్, మొక్కలు నాటి స్వచ్చతా ప్రతిజ్ఞ అనతరం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలసి మాస్ క్లీనింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, స్వచ్చాంద్ర-స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ఒక థీమ్ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఫిబ్రవరి నెలకు `సోర్స్ – రీ సోర్స్` ని ప్రకటించిందని, అందులో భాగంగా శనివారం గుంటూరు నగర పాలక సంస్థ 206 వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ ర్యాలీలు అవగాన కార్యక్రమాలు, మాస్ క్లీనింగ్ చేపట్టుట జరిగిందన్నారు. అతి త్వరలో గుంటూరు నగర ప్రజల సహకారంతో క్లీన్ అండ్ గ్రీన్ అండ్ హేల్తీ గుంటూరు సాకారం చేసుకుంటామన్నారు. ఇప్పటికే 57 డివిజన్ల వారీగా 809 మైక్రో పాకెట్స్ గా విభజించి నూరు శాతం పారిశుధ్య పనులు జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. పరిశరాల పరిశుభ్రతను నగర ప్రజలు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, తడి పొడి చెత్త వేరు చేసి ప్రజారోగ్య కార్మికులకు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, జిల్లా జైలు అధికారులు వీరేంద్ర ప్రసాద్, కిరణ్ కుమార్, తేజస్, ప్రేమ్ సాగర్, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర రావు, ప్రభుదాస్, నోడల్ ఆఫీసర్ రాంబాబు,మానవతా స్వచ్చంద సంస్థ ప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
