విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాలీసెట్ 2025. గోడ పత్రికను 14-2-2025 సాయంత్రం 7:30 కు సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో ఉన్నత విద్య నైపుణ్యా శిక్షణ కార్యదర్శి కోన. శశిధర్ ఐ.ఏ.ఎస్ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ జి .గణేష్ కుమార్ ఐ.ఏ.ఎస్ కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భగత్ గుప్తా మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి .విజయరామరాజు ఐ.ఏ.ఎస్ . మరియు సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధి కారులుమరియు రాష్ట్ర సాంకేతిక శిక్షణ మండలి అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు ఇందులో పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకతలు ప్రయోజనాలు మరియు పాలిటెక్నిక్ విద్య అనంతరం ఇతర ఉద్యోగ విద్యా అవకాశాల గురించి పొందుపరచడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి ప్రాంగణ నియామకాల ద్వారా ప్రముఖ బహుళ జాతి కంపెనీలలో అత్యుత్తమ వేతనాలతో ఉద్యోగం పొందిన కొంతమంది విద్యార్థుల విజయాలను మరియు ఇతర ఉపకార వేతనాల ప్రయోజనాలను కూడా ప్రస్తావించడం జరిగినది
