Breaking News

విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గింపు.. పునరుత్పాదక ఇంధనానికి భారీ లక్ష్యాలు

-ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ రాష్ట్ర విద్యుత్ రంగంలో సాధించిన పురోగతి, భవిష్యత్ లక్ష్యాలు, వ్యయ నియంత్రణ చర్యలను వివరించారు.

•రాష్ట్ర విద్యుత్ రంగంలో 21,852 MW కాంట్రాక్టెడ్ సామర్థ్యం, 2025-26లో 79,971 MU విద్యుత్ వినియోగం, యూనిట్‌కు సగటు ₹4.90 కొనుగోలు వ్యయం నమోదైంది. పునరుత్పాదక ఇంధన వాటా 39.9% గా ఉంది.

•విద్యుత్ డిమాండ్ 2035 నాటికి సుమారు 1,80,000 MUకు చేరే అవకాశం ఉండటంతో, 78.5 GW సౌర, 35 GW విండ్, 22 GW పంప్డ్ స్టోరేజ్, 25 GWh బ్యాటరీ స్టోరేజ్ లక్ష్యాలను నిర్దేశించారు. మొత్తం ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

•విద్యుత్ కొనుగోలు విధానంలో సంస్కరణలతో 2022-24లో నెలకు సగటు ₹641.5 కోట్లుగా ఉన్న స్వల్పకాలిక కొనుగోలు వ్యయం, 2024-26లో ₹194 కోట్లకు తగ్గింది. విద్యుత్ కొనుగోలు సగటు ధర ₹7.78 నుంచి ₹5.15/యూనిట్‌కు తగ్గింది.

•Market-Based Economic Dispatch (MBED), Day-Ahead Market (DAM), Real-Time Market (RTM), డిస్పాచ్ ఆప్టిమైజేషన్ వంటి చర్యలతో విద్యుత్ కొనుగోలు వ్యయం మరింత తగ్గింది. 2026-27 ఏప్రిల్-జూలైలో కొనుగోలు వ్యయం ₹5.20 నుంచి ₹4.97/యూనిట్‌కు, అంటే 23 పైసలు తగ్గింది.

•వినియోగదారులపై అదనపు భారం లేకుండా ఎటువంటి టారిఫ్ పెంపు చేయలేదు. వ్యవసాయానికి 20.78 లక్షల మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్, SC/ST మరియు బలహీన వర్గాల 22 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగుతోంది. ఆక్వా రంగానికి రాయితీ విద్యుత్ ద్వారా ₹1,067 కోట్ల సబ్సిడీ అందుతోంది.

•ఎల్‌నినో పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విశ్వసనీయంగా కొనసాగింది. 15,016 MW గరిష్ఠ డిమాండ్, రోజువారీ గరిష్ఠంగా 288.90 MU సరఫరా నమోదైంది. ట్రాన్స్‌మిషన్ నష్టాలు 2.60%కు పరిమితమయ్యాయి.

•PM-KUSUM కింద 2,93,587 వ్యవసాయ సోలార్ పంపులకు MNRE 100% ఆమోదం లభించింది. 228 ప్లాంట్లకు భూసేకరణ పూర్తి, 196 ప్లాంట్లలో సివిల్ పనులు ప్రారంభమయ్యాయి.

•PM-Surya Ghar కింద SC/ST వినియోగదారుల కోసం 664.09 MW సామర్థ్యం స్థాపించి 3,32,043 ఇన్‌స్టాలేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ భవనాల సౌర విద్యుదీకరణకు సుమారు 201 MW, 28 జిల్లాల్లో 2,932 ప్రభుత్వ భవనాలకు 46.72 MW రూఫ్‌టాప్ సోలార్ ప్రణాళికలో ఉంది.

•భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు Green Energy Corridor-III ద్వారా 18.4 GW పునరుత్పాదక విద్యుత్ తరలింపునకు ₹21,838 కోట్ల ప్రాజెక్టు ప్రతిపాదించారు. ఇందులో 7,872 ckm ట్రాన్స్‌మిషన్ లైన్లు, 9,500 MVA సామర్థ్యం, 5 కొత్త 400/220 kV సబ్‌స్టేషన్లు ఉంటాయి.

•Battery Energy Storage System – BESS ద్వారా 225 MW/450 MWh జనవరి 2027లో, 150 MW/300 MWh ఆగస్టు 2027లో అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. EV మౌలిక వసతులలో భాగంగా 131 ప్రాంతాల్లో 577 ఛార్జర్ల ఏర్పాటుకు LOAలు జారీ అయ్యాయి.

•విద్యుత్ రంగంలో AI ఆధారిత Asset Health Index, Digital Twin వంటి సాంకేతికతలను వినియోగిస్తున్నారు. APTRANSCOలోని 380 సబ్‌స్టేషన్లలో Digital Twin అమలు చేసి, సంవత్సరానికి 123 MU విద్యుత్ ఆదా, సుమారు ₹6 కోట్ల అదనపు ఆదాయం సాధించారు.

•పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్, PM-KUSUM, ప్రభుత్వ భవనాల సోలరైజేషన్, ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల కోసం జిల్లా కలెక్టర్లు DISCOMలు, NREDCAP, APTRANSCOతో సమన్వయం, భూ/ROW సమస్యల పరిష్కారం, వినియోగదారుల అవగాహన మరియు అమలుపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *