Breaking News

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ప్రారంభించిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఏపీ

-ముంబై ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో పట్టాభిరామ్
-ఐ-ఫ్యాట్ ఎగ్జిబిషన్‌లో ఆంధ్రప్రదేశ్ పారిశుద్ధ్య కార్యక్రమాల ప్రదర్శన

ముంబై, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ప్రారంభించిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. ముంబైలోని గోరేగావ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఫర్ వేస్ట్ వాటర్ టెక్నాలజీ(ఐ-ఫ్యాట్- ఐఎఫ్ఏటీ) సంస్థ
భారీస్థాయిలో ఏర్పాటు చేసిన వాణిజ్య ప్రదర్శనలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ స్టాల్ ని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ శుక్రవారం సందర్శించారు. సురక్షితమైన నీరు సరఫరా, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చడం, మురుగునీటి నిర్వహణ, వర్షపు నీటి నిల్వలు, ఘనవ్యర్థాలు, రీసైక్లింగ్ కి సంబంధించి మన దేశంలో ఏర్పాటు చేసిన భారీ ప్రదర్శన ఇది. 30 దేశాల నుంచి 600కు పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. నగరాల్లో పేరుకుపోయే ప్లాస్టిక్, ఈ-వ్యర్థాల రీసైక్లింగ్, వ్యర్థాల నుండి విద్యుత్/ఇంధనం ఉత్పత్తి, పారిశ్రామిక పొగను, గాలి కాలుష్యాన్ని తగ్గించే ఎయిర్ స్క్రబ్బర్లు, వాయు నాణ్యతను పర్యవేక్షించే పరికరాలు, ఆరు వేలకు పైగా పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. పర్యావరణ ఇంజనీర్లు, మునిసిపల్ అధికారులు, పరిశ్రమల అధినేతలు, పారిశ్రామికవేత్తలు ఇక్కడ చర్చల్లో పాల్గొని సరికొత్త గ్రీన్ టెక్నాలజీ అంశాలను పంచుకుంటారు.
చైర్మన్ పట్టాభిరామ్ ఈ ఎగ్జిబిషన్ లోని స్టాల్స్ ని సందర్శించి, అత్యాధునిక యంత్ర పరికరాలను, వాటి ఉపయోగాలను పరిశీలించారు. వాటిలో మన రాష్ట్రానికి ఉపయోగపడే వాటి గురించి స్టాల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఎగ్జిబిషన్ లో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ స్టాల్

ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ స్టాల్‌ని సందర్శించిన సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ తరఫున ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (ఏఎల్ఎల్ఎస్‌జీ) ఈ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర, ఆపరేషన్ క్లీన్ స్వీప్, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు, వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లు, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు, సామర్థ్య నిర్మాణ తదితర కార్యక్రమాలతోపాటు ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యక్రమాలను ఈ స్టాల్‌లో ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక పారిశుద్ధ్య, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తోన్నట్లు చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ కార్యక్రమాల అమలు భాగస్వామిగా ఏఎల్ఎల్ఎస్‌జీ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, విజయాలు, ఉత్తమ విధానాలను ప్రదర్శించడంలో ఈ సంస్థ కీలకంగా సహకరిస్తోన్నట్లు వివరించారు. ఏపీలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొత్త టెక్నాలజీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారని, వాటిని మన రాష్ట్రంలో ఏ విధంగా ఉపయోగించవచ్చో పరిశీలించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, కార్పోరేషన్ ఎండీ బి.సునీల్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడకు వచ్చి, ఈ టెక్నాలజీని పరిశీలించినట్లు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు తెలిపారు. మన రాష్ట్రం తరఫున ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం గొప్ప అవకాశం అని పట్టాభిరామ్ అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమ వర్గాలకు మనం అమలు చేసే కార్యక్రమాలు పరిచయం చేసేందుకు ఓ కీలక వేదికగా ఇది నిలుస్తుందన్నారు. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ స్పష్టమైన దార్శనికత, వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న ప్రతినిధులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు, పర్యావరణ నిర్వహణ రంగ నిపుణులు, ఇతర భాగస్వాముల నుంచి విశేష స్పందన లభించినట్లు చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *