పమిడిముక్కల, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఇళ్ల లబ్దిదారులకు అడ్వాన్స్ సొమ్మును త్వరితగతిన అందించి ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పమిడిముక్కల మండలం వీరంకి 1 మరియు 2 మరియి అగ్నిపర్రు లలోని లేఔట్ లలో ఇళ్ల నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన, లబ్దిదారులకు నిర్మాణ సామాగ్రి పంపిణీలను జేసీ పరిశీలించారు. అనంతరం పమిడిముక్కలలో అధికారులతో జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ నుపూర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమయం ఇళ్ల నిర్మాణ పనులకు ఎంతో అనుకూలమైనదని, ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేలా అధికారులు లబ్దిదారులందరిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాబాయిదారులకు 15 వేల రూపాయలు చొప్పున అడ్వాన్స్ మొత్తంగా అందించాలని నిర్ణయించిందని, ఈ సొమ్మును ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు వచ్చే లబ్ధిదారులందరికీ అందించాలని జేసీ అధికారులను ఆదేశించారు. అడ్వాన్స్ సొమ్ము తీసుకున్న లబ్దిదారులకు తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగాను, సిమెంట్, ఐరన్ వంటి మెటీరియల్స్ ను సబ్సిడీ పై లబ్దిదారులకు పూర్తిగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి లబ్దిదారులకు ఏ సమస్య రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. లబ్ధిదారుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు గృహ నిర్మాణ శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జేసీ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిన లబ్దిదారులకు సంబంధించి బిల్లుల చెల్లింపు సకాలంలో జరిగేలా గృహ నిర్మాణ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా బిల్లుల చెల్లింపులు, నిర్మాణ సామాగ్రి పంపిణీలో ఫిర్యాదు అందితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జేసీ నుపూర్ అజయ్ కుమార్ అధికారులను హెచ్చరించారు. జేసీ వెంట ఎంపిపి కాసాని వేద సుప్రజ, తహసీల్దార్ సంధ్య, ఎంపిడిఓ ఏ .ఎన్ .వి నాంచారరావు , గృహ నిర్మాణ శాఖ డి ఈ రమేష్,వివివాద శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కార్యదక్షత గల ప్రజానాయకుడు లోకేష్ : ఎంపి కేశినేని శివనాథ్
-4వ డివిజన్ లో లోకేష్ జన్మదిన వేడుకలు -కేక్ కట్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా , ఎంపి కేశినేని …