Breaking News

వికలాంగులకు పెట్రోల్ మంజూరుకై కమిషనర్ తగు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వికలాంగులకు పెట్రోల్ మంజూరుకై దృవీకరణ కోసం బాలకృష్ణ అందించిన అర్జీని పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఉపా సెల్ పిఓని ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో ఆర్.అగ్రహారం నివాసి వికలాంగులుడైన టి.బాలకృష్ణ కమిషనర్ ని కలిసి స్వయం ఉపాధి చేసుకుంటూ, వికలాంగ కోటాలో ప్రభుత్వం మంజూరు చేసిన 3 చక్రాల వాహనంకు పెట్రోల్ మంజూరు కోసం ద్రువీకరణ పత్రం కోసం అర్జీ అందించారు. స్పందించిన కమిషనర్ తక్షణం సదరు అర్జీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, త్వరితగతిన తగు చర్యలు తీసుకోవాలని ఉపా సెల్ పిఓని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *