-జీవనం సాగించేందుకు మనో ధైర్యాన్ని ఇచ్చే శక్తి భక్తి ద్వారానే కలుగుతుంది.
– మంత్రి వేణుగోపాల కృష్ణ
కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఇంచార్జి మంత్రి , రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫి శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ సోమవారం ఉదయం కోరుకొండలో కొలువైవున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించి పూజాధి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల కృష్ణ కు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదమంత్రాలతో పూజాధి కార్యక్రమాలు నిర్వహించి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీర్వచనాలు అందచేసి, శ్రీ స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పవిత్రమైన రామ ప్రతిష్ట జరుగుతున్న నేడు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జీవనం సాగించేందుకు మనో ధైర్యాన్ని ప్రసాదించే శక్తి భక్తి ద్వారానే కలుగుతుందని తాను నమ్ముతానని మంత్రి పేర్కొన్నారు. బాలుడైన ప్రహ్లాదుడ్ని రక్షించేందుకు అవతరించిన నరసింహుడు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి శక్తిని ప్రసాదించాలని నరసింహడ్ని ప్రార్థించడం జరిగిందని మంత్రి తెలిపారు. విద్యకు దూరంగా, ఆర్థిక స్థితిగతులు బాగోలేని వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు కొనసాగిస్తూ మంచి సత్ఫలితాలు నివ్వాలని కోరుకోవడం జరిగిందన్నారు. జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ సుఖ: సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి రాష్ట్రం లో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదర్శ వంతమైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు. మంత్రి వెంట స్థానిక నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News