తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని సరోజిని దేవి రోడ్ లోగల ప్రభుత్వ బాలికల హోమ్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల ఈహోమ్ కు చెందిన విద్యార్థినిపై లైంగిక దాడి జరగడంపై సీతారాం ఆరా తీశారు,హోమ్ సూపరింటెండెంట్ సి.నయోమి తోను ఇతర సిబ్బందితో మాట్లాడి సంభందిత వివరాలు అడిగి తెలుసుకున్నారు,హోమ్ పర్యవేక్షకుల నిర్లక్ష్యమా,లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్నదానిపై పూర్తి సమగ్ర నివేదిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు అందజేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు,ఇప్పటికే ఇదే అంశంపై తమ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారన్నారు,కట్టుదిట్టమైన భద్రతతో ఉండాల్సిన ఈ హోమ్ విద్యార్ధినులు ఇటువంటి లైంగిక దాడుల ఆరోపణలు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయని అన్నారు,ఇటువంటి దాడులు భవిష్యత్ లో జరగకుండా లోతైన అధ్యయనంతో ప్రత్యేక దృష్టి సారించనున్నామని అన్నారు,జిల్లా ఉన్నతాధికారులు అందించే నివేదికను ఆధారంగా హోమ్ సిబ్బంది,అధికారులపై వివిధ క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు వెనుకడుగు వేసేది లేదని సీతారాం చెప్పారు,అనంతరం పిల్లలకు అందిస్తున్న భోజన సదుపాయంపై బాలికలు,సిబ్బంది నుండి అడిగితెలుసుకున్నారు. ఈ సందర్శనలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ఎం.వసంత,సభ్యులు పి.వి.ఎస్.రవి కుమార్,పి.చంద్రశేఖర్ రెడ్డి,బి.మురళీ మోహన్,ఎల్.కృష్ణమ నాయుడు,జిల్లా బాలల సంరక్షణ అధికారి వి.శివశంకర్,తిరుపతి సిడిపిఓ.శివశంకర్ రెడ్డి,హోమ్ వైద్యురాలు ఎన్.జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
కార్యదక్షత గల ప్రజానాయకుడు లోకేష్ : ఎంపి కేశినేని శివనాథ్
-4వ డివిజన్ లో లోకేష్ జన్మదిన వేడుకలు -కేక్ కట్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా , ఎంపి కేశినేని …