Breaking News

మంజూరైన గృహాలను నిర్మించకుంటే రద్దయ్యే అవకాశం.

-రానున్న జూన్ నాటికీ మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి.
-గృహానిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయండి.
-కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం
-జిల్లా కలెక్టర్ డా.జి. సృజన

జి కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదవానికి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ద్వారా పక్కా గృహాలను మంజూరు చేయడం జరిగిందని లబ్ధిదారులు మంజూరైన ఇళ్ల నిర్మాణం చేపట్టి రానున్న జూన్ మాసం నాటికీ పూర్తి చేయకుంటే నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదని గృహాలను నిర్మించుకోవడంలో లబ్ధిదారులుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన సూచించారు.
జి కొండూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న గృహనిర్మాణ లేఅవుట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ జి. సృజన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జి కొండూరు సమీపంలో నిర్మిస్తున్న లేఅవుట్ నందు 360 మంది లబ్దిదారులకు గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిలో 51 గృహా నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని 164 బిలో బేస్మెంట్ లెవెల్, 91 బేస్మెంట్ లెవెల్, 2 లింటల్ లెవెల్, 11 రూఫ్ లెవెల్, 34 రూఫ్ కాస్టింగ్ లెవెల్ దశలలో ఉన్నాయన్నారు. పేదలకు మంజూరు చేసిన గృహాలను రానున్న జూన్ నాటికీ తప్పనిసరిగా పూర్తి చేయవలసి ఉటుందన్నారు. నిర్మాణాలను చేపట్టకుంటే మంజూరైన గృహాలు రద్దవుతాయని భవిషత్తులో కేంద్ర ప్రభుత్వం నుండి గృహాలు మంజూరయ్యే అవకాశం ఉండదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీలలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గృహా నిర్మణాలకు సంబంధించి లబ్ధిదారులకు చెల్లింపుల విషయంలో నిధుల కొరత లేదని పూర్తి చేసిన పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు నివేదిక సమర్పించాలని జలజీవన్ మిషన్ ఉపాధిహామీ నిధులతో పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సృజన ఆదేశించారు.

లేఅవుట్ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట గృహా నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. రజిని కుమారి, హౌసింగ్ ఇఇ గఫూర్,
డీఈ శ్రీనివాసరావు, డీఎస్ఓ మోహన్ బాబు, ఎంపీడీవో అనురాధ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కార్య‌ద‌క్ష‌త గల ప్ర‌జానాయ‌కుడు లోకేష్ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-4వ డివిజ‌న్ లో లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు -కేక్ క‌ట్ చేసిన రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా , ఎంపి కేశినేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *