Breaking News

విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

-దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన చంద్ జయంతి పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం 2024 నిర్వహణ నేపథ్యంలో స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, బాలాజీ కాలనీ నుండి మహతి ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన చంద్ జయంతి పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవ దినోత్సవం 2024 ను నిర్వహించుకోవడం జరుగుతోందని భారత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ గారు గొప్ప హాకీ ప్లేయర్ అని, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన ఒలింపిక్స్ క్రీడలలో వారి స్పూర్తితో 8 గోల్డ్ మెడల్స్ సాధించడం ఒక ఎనలేని ఘనత అని తెలిపారు. మన ఈ నెల 26 నుండి పలు క్రీడల పోటీలు, యితర పోటీలు కళాశాలల్లో, పాఠశాలల్లో నిర్వహించి క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది అని తెలిపారు. ఈ మధ్య కాలంలో ప్రజలు, యువత వారి దైనందిన జీవితంలో ఉంటున్న వర్క్ స్ట్రెస్ వలన, మానసిక వొత్తిడి వలన, సెల్ ఫోన్, సోషల్ మీడియా వంటి వాటి మితిమీరి వాడకం తదితరాల వలన, క్రీడల పట్ల ఆసక్తి, సమయం కేటాయించడం, శారీరక వ్యాయామం తగ్గిందని తద్వారా చిన్న వయసు నుండే బిపి లు, డయాబెటిస్ వంటి పలు వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. వీటి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలు, వ్యాయామానికి కనీసం 30 నిమిషాలు కేటాయించాలని తద్వారా ఆరోగ్యకరమైన మంచి సమాజం ఏర్పాటు అవుతుందని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, వ్యాయామం దైనందిన జీవితంలో విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలి అని సూచిస్తూ, తద్వారా శారీరక, మానసిక దృఢత్వమే కాకుండా, టీమ్ స్పిరిట్, కాన్ఫిడెన్స్ స్థాయిలు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలోని టీచర్లు, పీఈటీ లు క్రీడా మైదానాలు ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా విద్యార్థులకు క్రీడలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.

ర్యాలీ ప్రారంభానికి ముందుగా ధ్యాన్ చంద్ గారి చిత్ర పటానికి కలెక్టర్ పూల మాల వేసి, అందరితో క్రీడలపై ప్రతిజ్ఞ చేయించారు. స్పోర్ట్స్ స్టేడియం నందు క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, బ్యాడ్మింటన్ కోర్టు వంటి పలు వాటిని కలెక్టర్ డి ఎస్ డి ఓ తో కలిసి పరిశీలించి పలువురు క్రీడాకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుమారి దండు పూజ ఇంటర్నేషనల్ షటిల్ ప్లేయర్ మరియు 73వ నేషనల్ గేమ్స్ గోవా నందు మిక్స్డ్ డబుల్స్ పోటీలో గోల్డ్ మెడల్ గ్రహీతను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్, జిల్లా ఒలంపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్, ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి డైరెక్టర్ ఎస్వియు, జయచంద్ర డైరెక్టర్, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, జిల్లా మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ, ఎన్సిసి అధికారులు, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, ఎన్సిసి, సీనియర్ సిటిజన్లు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కార్య‌ద‌క్ష‌త గల ప్ర‌జానాయ‌కుడు లోకేష్ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-4వ డివిజ‌న్ లో లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు -కేక్ క‌ట్ చేసిన రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా , ఎంపి కేశినేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *