-మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ తో కలిసి బాధితులకి దుప్పట్ల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద కారణంగా ముంపు గురైన ప్రాంతాలను మాత్రమే కాదు…బాధితులందరూ సాధారణ స్థితికి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయక చర్యలు అందిస్తుంది. ముంపు బాధితులను అందరిని ఆదుకోవడమే ప్రభుత్వం లక్ష్యమని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో వరద బాధితులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం శనివారం 30 డివిజన్ దేవి నగర్ లోని రామకృష్ణపురంలో …
Read More »Monthly Archives: September 2024
సీఎం చంద్రబాబు నాయకత్వంలో విజయవాడను ముంపు లేని నగరంగా తీర్చిదిద్దుతాం : ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అస్నా తుఫాన్ కారణంగా ఏర్పడిన వరద తాకిడికి బుడమేరు వాగుకి పడిన మూడు గండ్లను పూర్తి పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. ముందుగా వరద కారణాంగా నగరంలో ఏర్పడిన డ్యామేజీని కంట్రోల్ చేసి పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకువచ్చిన తక్షణం భవిష్యత్తులో విజయవాడకి ఎంత వరద వచ్చినా ఎలాంటి నష్టం వాటిల్లకుండా నగరాన్ని తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ …
Read More »వినాయకుని నిమజ్జనం , సీతమ్మ వారి పాదాలు వద్దగల కృష్ణానదిలో చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితిని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగర ప్రజలకు శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ వారు వినాయక చవితి నిమజ్జనానికి చేసిన ఏర్పాటు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వినాయక చవితి అయిన తర్వాత ప్రజలు నిమజ్జనం చేసేటప్పుడు విజయవాడ నగర పాలక సంస్థ నిర్దేశించిన ప్రాంతమైన సీతమ్మ వారి …
Read More »361 మెషిన్లతో ఏడు వేలకు పైగా పారిశుద్ధ్య కార్మికులతో వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు తమ తమ సమస్యలు కమిషనర్ కి వివరించగా, ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి అవ్వదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక …
Read More »పంపు సహాయంతో వరద నీటిని తీస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ
-వరద ప్రభావిత ప్రాంతాలలో కేవలం టాంకర్లలో అందించిన నీటిని మాత్రమే త్రాగుటకు వినియోగించండి -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం శనివారం ఉదయం అయోధ్య నగర్, బుడమేరు కట్ట వద్ద సూర్య కాలనీ అయోధ్య నగర్ ప్రాంతాలలో నిలిచి ఉన్న వరద నీరును పంపు సహాయంతో ఇంజనీరింగ్ సిబ్బంది తీస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం మాట్లాడుతూ విజయవాడ …
Read More »వరద ప్రాంతాల నుంచి గర్భిణీ స్త్రీని కాపాడిన విజయవాడ నగరపాలక సంస్థ బృందం -బోట్లోనే డెలివరీ
-అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు- తల్లి, బిడ్డ క్షేమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల తో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచనలు తో వరద ప్రభావిత ప్రాంతాలలో సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన అత్యవసర ఫిర్యాదును, విజయవాడ నగర పాలక సంస్థ బృందం, తక్షణమే చర్యలు తీసుకున్నారు. వాంబే కాలనీలో శనివారం ఉదయం రెండు గంటలకు నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీను, సింగ్ నగర్ …
Read More »విఘ్నేశ్వరుని కృపతో నగరం త్వరగా కోలుకోవాలి…
-విజయవాడ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు -వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పర్వదినం సందర్భంగా విజయవాడ ప్రజలకు వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ కార్యం చేపట్టాలన్న తొలి పూజ, ఆరాధన విఘ్నేశ్వరునికే చేస్తామని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆ గణనాథుని చల్లని దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని.. సుఖ …
Read More »సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటున్నాం..
– డిజిటల్ సాధికారతను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం – ప్రజాభిప్రాయం ఆధారంగా మరింత మెరుగైన సేవలు. – పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. – 7,100 మంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. – అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. – ఉచితంగా బస్సు సర్వీసులను నడుపుతున్నాం. – 6 వస్తువుల నిత్యవసర సరుకుల ప్యాకేజీ ప్రతిఒక్కరి హక్కు. – వరద ప్రభావిత ప్రజలు గట్టిగా అడిగి తీసుకోండి – ఏ పనిచేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తాననే పేరు నాకుంది – సాయమందించడం సమష్టి …
Read More »బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ పర్యటన జరిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి గంటన్నరపాటు ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా బుడమేరు డ్రైన్ కు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. భారీ వరద, గండ్లు కారణంగా ఏయే ప్రాంతాలు నీటమునిగాయి అనేది పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, వరద ఎటునుంచి ఎటు వెళ్తుంది అనేది పరిశీలించారు. …
Read More »పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ‘మొబైల్ టీం’ ఏర్పాటు
-ఏలూరు జిల్లావ్యాప్తంగా మొబైల్ టీం విస్తృత సేవలకు సిద్ధం -వినూత్న ఆలోచనతో జిల్లాలో సమర్ధవంతంగా పారిశుద్ధ్య నిర్వహణ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఏలూరు జిల్లా కొత్త తరహా కార్యక్రమానికి నాంది పలికింది. పారిశుద్ధ్య కార్మికులతో మొబైల్ టీం ఏర్పాటు చేసి జిల్లాలో అవసరమైన చోట కార్మికుల సేవలను వినియోగించుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ప్రయోగత్మకంగా జిల్లాలో అమలు చేయనున్న మొబైల్ పారిశుద్ధ్య కార్మికుల టీంలో 13 …
Read More »
Prajavartha Online Telugu News