Breaking News

Daily Archives: April 17, 2026

స్వీయ గ‌ణ‌న‌తో దోష‌ర‌హిత డేటా!

– ఈ ప్ర‌క్రియ‌లో ఉత్సాహంతో భాగ‌స్వాములుకండి – అందుబాటులో https://se.census.gov.in పోర్ట‌ల్ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వీయ గ‌ణ‌న‌తో దోష‌ర‌హిత డేటాతో పాటు స‌మ‌యం ఆదా అవుతుంద‌ని.. ప్ర‌తిఒక్క‌రూ డిజిట‌ల్ జ‌న గ‌ణ‌న తొలిద‌శ‌లో భాగంగా ప్రారంభ‌మైన స్వీయ గ‌ణ‌న (సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్ – ఎస్ఈ)లో ఉత్సాహంగా పాల్గొని త‌మ ఇంటి నుంచే స‌మాచారాన్ని న‌మోదు చేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు. శుక్ర‌వారం న‌గ‌రంలోని పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌లో సెన్స‌స్‌-2027కు సంబంధించి ఎన్యూమ‌రేట‌ర్లు, …

Read More »

విద్యా ప్ర‌మాణాల‌కు ప్ర‌భుత్వం పెద్ద‌పీట‌

– పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో రాజీలేదు – విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకొని బాగా చ‌దువుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అత్యున్న‌త విద్యా ప్ర‌మాణాల‌తో విద్య‌ను అందించేందుకు ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని.. పాఠ‌శాల‌ల్లో క‌ల్పించిన సౌక‌ర్యాల‌ను స‌ద్వినియోగం చేసుకొని చిన్నారులు బాగా చ‌దువుకొని ఉన్న‌తంగా ఎద‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయి సంద‌ర్శ‌న‌ల్లో భాగంగా శుక్ర‌వారం నందిగామలోని డీవీఆర్ కాల‌నీ ఎంపీపీ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. …

Read More »

అంగ‌న్వాడీ కేంద్రంలో త‌నిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ నందిగామ డీవీఆర్ కాల‌నీలోని అంగ‌న్వాడీ కేంద్రాన్ని కూడా త‌నిఖీ చేశారు. చిన్నారులలో వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువుకు సంబంధించిన రికార్డుల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. చిన్నారుల‌కు అందిస్తున్న పోష‌కాహారం వివ‌రాల‌ను ప‌రిశీలించారు. చిన్నారులలో తీవ్ర పోషకాహార లోపం (సివియర్ ఎక్యూట్ మాల్న్యూట్రిషన్- ఎస్ ఏ ఎం), మిత పోషకాహార లోపం (మోడరేట్ ఎక్యూట్ మాల్ న్యూట్రిషన్ -ఎం ఏ ఎం) ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని.. …

Read More »

సెలవు రోజుల్లో కూడా పనిచేయనున్న క్యాష్ కౌంటర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సౌకర్యర్థం నగరంలోని క్యాష్ కౌంటర్లు సెలవు రోజుల్లో కూడా అన్నియును అందుబాటులో ఉన్నాయన్నారు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి.సృజన శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయలపై 50% వడ్డీ రాయితీ, 2026- 27 సంవత్సరమునకు ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ, పండుగ రోజుల్లో కూడా ప్రజలు …

Read More »

నిర్మాణ వ్యర్ధాలతో సంపద సృష్టించేందుకు సి అండ్ డి ప్లాంట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని నిర్మాణ వ్యర్ధాలతో సంపదను సృష్టించేందుకు సిఎన్డి ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల బిల్డర్లు అందరూ అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లోని సి అండ్ డి ప్లాంట్ కు నిర్మాణ వ్యర్ధాలను పంపించాలని చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడున్నా సరే వాటిని అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి ఫైర్ సేఫ్టీ వీక్ లో భాగంగా శుక్రవారం ఉదయం NTR కాలనీలో రవీంద్ర భారతి నెక్స్ట్ జెన్ పాఠశాల లో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలను ఎలా నిరోధించాలి అనే అంశం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టారీత్యా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు అన్నారు. సర్కిల్-3 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన కేసులు పై శుక్రవారం సర్కిల్-3 కార్యాలయం, పటమట లో ఏర్పాటుచేసిన మొబైల్ కోర్టులో విచారణ జరిపారు. న్యాయమూర్తి గోలీ లెనిన్ బాబు మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేసినా, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువులు ఉంచిన, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్టు …

Read More »

ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం కోళ్ల ఫారం రోడ్డు, భవానిపురం లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నగరంలో …

Read More »