Breaking News

Daily Archives: May 4, 2026

కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపుతాయని వెల్లడించారు. విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం (05-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, …

Read More »

బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కమిషన్‌ ఆరా

-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వినతుల స్వీకరణ -కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్‌ సోమవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది.  కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ …

Read More »

హజ్ కు బయలుదేరిన 185 మంది ఏపీ యాత్రికులు

-హైదరాబాద్ హజ్ క్యాంపు వద్ద వీడ్కోలు పలికిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఎంఏ షరీఫ్ -ఆధునిక వసతులు కల్పించిన ప్రభుత్వానికి హాజీల కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ ఎంబార్కేషన్ కేంద్రం శంషాబాద్ విమానాశ్రయం నుండి 185 మంది ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యాత్రికులు హజ్ యాత్రకు సోమవారం బయలుదేరి వెళ్లారు. విడిది కేంద్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన హాజీల తరలింపు వాహనాలను మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ …

Read More »

“యోగా డే” సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

-నిర్వహణ పై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆయుష్ అధికారులతో సమీక్ష -త్వరలో మరోమారు భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల (జూన్) 21వ తేదీన ‘ అంతర్జాతీయ యోగా డే’ పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ విషయమై తొలి సన్నాహాక సమావేశం రాష వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం విజయవాడలోని ఆయుష్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగాసనాల ప్రాధాన్యంపట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, …

Read More »

గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం – మంత్రి కందుల దుర్గేష్

-గోదావరి పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.. తదనునుగుణంగా భారీ ఏర్పాట్లు – మంత్రి కందుల దుర్గేష్ -భక్తుల భద్రతే కూటమి ప్రభుత్వ బాధ్యత.. ఏడాది ముందుగానే పుష్కర పనుల శ్రీకారం -“పుష్కర నిధులతో మున్సిపాలిటీల్లో శాశ్వత అభివృద్ధి.. పర్యాటకశాఖ తరఫున టెంట్ సిటీలు, హోమ్ స్టేల ఏర్పాటు: మంత్రి కందుల దుర్గేష్” -“రాజమహేంద్రవరంలో త్వరలో అఖిల పక్ష శాఖల సమీక్ష.. పుష్కర పనులపై మంత్రి దుర్గేష్ క్లారిటీ” -“కేంద్ర, రాష్ట్ర నిధులతో పుష్కర ఘాట్లు, రోడ్ల అభివృద్ధి.. త్వరలోనే …

Read More »

సింగ్‌నగర్‌లో చిన్ని గణ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2 బొండా సిద్ధార్థ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

-టాస్ నిర్వహించి జట్లకు శుభాకాంక్షలు, క్రీడాకారులతో సరదా సంభాషణ, క్రికెట్ ఆడిన యువ నాయకుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సోమవారం నిర్వహించిన చిన్ని గణ క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ సీజన్ – 2 కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో పాల్గొన్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాస్ నిర్వహించారు. అనంతరం క్రీడాకారులతో సరదాగా ముచ్చటించి, కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ …

Read More »

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రిటర్నబుల్ ప్లాట్ల రీ ఎలాట్మెంట్, ల్యాండ్ పూలింగ్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IAS, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS, కొల్లాబత్తుల కార్తీక్ IASకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ గ్రీవెన్స్ …

Read More »

ఎస్.ఎం.ఏ.ఎం పధకం క్రింద రాయితీ పై వ్యవసాయ పరికరాలు

-జిల్లాకు రూ.3.04 కోట్లు కేటాయింపు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని  రైతులు సాగుకు ఉపయోగించే యంత్ర పరికరాలను సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (SMAM) పధకం క్రింద రాయితీ పై ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందు కోసం జిల్లాకు రూ.3.04 కోట్లు కేటాయిoచిందన్నారు. రైతులకు అవసరమైన పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, హార్వెస్టింగ్ త్రేషర్లు, పురుగు మందులు పిచికారి చేసేందుకు ఉపయోగించే స్ప్రేయర్లు …

Read More »

గుంటూరు జిల్లా కీలక ప్రాజెక్టుకు రాష్ట్రం అనుమతి

-గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు రూ. 369.20 కోట్ల మంజూరు -పెమ్మసాని ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు -33 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు స్థిరీకరణ -33 గ్రామాలు, 4 లక్షలకు పైగా ప్రజలకు ఆసరా గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గుంటూరు జిల్లా ప్రజల కల సాకారమయింది. 33 వేల ఎకరాల ఆయకట్టుకు, 33 గ్రామాల ప్రజలకు ఆసరాగా మారుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గుంటూరు ఛానల్ ఆధునికీకరణ …

Read More »

ఆంధ్రా ఉపాధ్యాయులు.. సింగపూర్ బాట

-37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ వేదికపై శిక్షణ -నేడు ప్రపంచ విద్యార్థులు… రేపటి తరానికి మార్గదర్శకులు! -ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో నవశకం -గ్లోబల్ స్టాండర్డ్స్ దిశగా అడుగులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, బోధనా నాణ్యతను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. దేశ చరిత్రలోనే ఒక వినూత్న ప్రయోగంగా, మన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై శిక్షణ పొందుతూ, గ్లోబల్ లీడర్లుగా …

Read More »