బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కమిషన్‌ ఆరా

-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వినతుల స్వీకరణ
-కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్‌ సోమవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది.  కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు.

ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్ల ఖరారులో కేవలం కుల గణన మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం కూడా ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు నిర్ణయించబడతాయని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, అదనపు కార్యదర్శి డి. చంద్రశేఖర్ రావుతో కలిసి కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ స్థానాల వివరాలు, బీసీలకు కేటాయించిన సీట్లు, గెలుపొందిన బీసీ అభ్యర్థుల సంఖ్య వంటి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల వివరాలను అందజేయాలని సూచించారు. వివిధ కులసంఘాల ప్రతినిధుల నుంచి వినతులను స్వీకరించి, ప్రతి నియోజకవర్గంలో బీసీల జనాభా నిష్పత్తిని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల ఖరారు జరుగుతుందని తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే కమిషన్‌ లక్ష్యమని చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా పేర్కొన్నారు. బహిరంగ విచారణలో స్వీకరించిన వినతులను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *