Breaking News

ఈ నెల 7డిసెంబర్ న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న పేరెంట్ టీచర్ సమావేశాలను ఫలవంతంగా, విజయవంతంగా నిర్వహించాలి

-పేరెంట్ టీచర్ సమావేశాలను తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల డిసెంబర్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారు సద్వినియోగం చేసుకునేలా, ఫలవంతంగా సమావేశాలు నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాలోని విద్యా శాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు, హెచ్ఎం లతో పేరెంట్ టీచర్ సమావేశాల సన్నద్ధత పై కలెక్టర్ వర్చువల్ విధానంలో సమీక్ష చేసి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో డిసెంబర్ ఏడో తారీఖున అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మెగా కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మరియు అన్ని గురుకుల పాఠశాలలో ఈ మేగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును తయారుచేసి అందించే ప్రక్రియ జాగ్రత్తగా చేపట్టాలని తెలిపారు. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు నందు విద్యార్థి మరి తల్లిదండ్రుల పూర్తి వివరాలను, విద్యార్థుల యొక్క హాబీలను అందులో నమోదు సక్రమంగా చేయాలని సూచించారు. ఈ పేరెంట్స్ మీటింగ్ నందు విద్యార్థుల గురించి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా వివరించడం, విద్యార్థుల యొక్క హాబీలను కూడా తల్లిదండ్రులకు తెలియపరచడం ఈ కార్యక్రమం ఒక మంచి వాతావరణంలో జరగాలని సూచించారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆట పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించాలని, పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అయిన తర్వాత ప్రభుత్వ మెనూ ప్రకారమే మిడ్ డే మీల్స్ ద్వారా మంచి పండగ వాతావరణం లో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎన్జీవోలు తదితరులు అక్కడే భోజనాలు చేయాల్సి ఉంటుందని, మొత్తం కార్యక్రమ ప్రక్రియను ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారుచేసి రాబోవు కాలంలో జరుగు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కి ఉపయోగపడేలా భద్ర పరచాలని, అదేవిధంగా పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై,బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పై అవగాహన కల్పించాలని, ముఖ్యంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది పిల్లల్లో అవగాహన కల్పించే విధంగా ఉండాలని సూచించారు. అలాగే పాఠశాల పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉత్తమ స్థానాల్లో ఉన్న వారిని ఆహ్వానించి వారు మంచి ఉన్నత స్థానాలకు ఎలా ఎదిగారో విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి గా తెలిపే విధంగా చూడాలని తెలిపారు.

ఈ వర్చువల్ సమావేశంలో డిఆర్ఓ నరసింహులు, జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్, ఎంఈఓలు, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, సమగ్ర శిక్ష, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *