-నూటికి నూరుశాతం డిజిటల్ వసూళ్లు చేపట్టాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇంటి పన్నులు, నీటి పన్నులను, ఇతర వసూళ్ళ ను డిజిటల్ విధానంలో మాత్రమే యు పి ఐ , క్యూ ఆర్ 2, పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్‌ల ద్వారా వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈమేరకు ఉత్తర్వుల్లో గతంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇంటి పన్నులు, నీటి పన్నులను డిజిటల్ మోడ్ ద్వారా అంటే UPI QR కోడ్‌లు మరియు POS మెషీన్‌ల ద్వారా వసూలు చేశాయని , ఇకపై ప్రతి ఒక్క పన్ను, పన్నేతర వసూళ్ల పరంగా అన్ని గ్రామ పంచాయతీ లకు డిజిటల్ విధానంలో కలెక్షన్ చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటికే డిజిటల్ నగదు చెల్లింపు వసూళ్ళ పరంగా తగినంత అవగాహన ఉందని పేర్కొన్నారు. అందువల్ల, తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో మరింత సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందన్నారు.
జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యదర్శులు ఇకపై అన్ని రకాల లావాదేవీలను పారదర్శకత తో వ్యవహరించి నిర్వహించాలని కలెక్టరు ప్రశాంతి స్పష్టం చేశారు. దీని ద్వారా నిర్దేశించబడ్డారు, భవన, భూముల క్రమబద్ధీకరణ (BLR) రుసుము, ఫిష్ ట్యాంక్ లీజు రుసుము, ఇతర అన్ని రకాల పన్నులు మొదలైనవి) గ్రామ పంచాయితీ డిజిటల్ విధానంలో మాత్రమే చేయాలన్నారు. ఇకపై నూటికి నూరు శాతం డిజిటల్ విధానంలో నగదు రూపంలో వసూళ్లు ఉండాలని, ఈ ఉత్తర్వులను అత్రిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఉత్తర్వులు తక్షణం బుధవారం నుంచి అమలులోకి వస్తాయనీ ఇన్చార్జి జిల్లా గ్రామ పంచాయితీ అధికారి ఎమ్. నాగలత తెలియ చేశారు. అందుకు అనుగుణంగా జిల్లాలోని అన్ని విస్తరణాధికారులు (PR&RD) మరియు అన్ని డివిజనల్ పంచాయితీ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ఎటువంటి ఫిరాయింపులు లేకుండా నిశితంగా గమనిస్తూ నిర్వహించేలా చూడాలని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News