రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందుజిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో సుప్రీం కోర్టు వారి ఆదేశాలను అనుసరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అధ్యక్షతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు మరియు పోలీసు అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఆమె తెలిపారు. “మోటారు వాహనాల చట్టం, 1988″ మరియు “హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీమ్, 2022” నిబంధనలను అనుసరిస్తూ బాధితులకు పరిహారం అందించేందుకు ఈ కమిటీలో ప్రతి ఒక్కరూ వారి సహకారాన్ని అందించాలని గంధం సునీత అన్నారు. ఈ సదస్సులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని ఆర్.డి.ఒ లు, రంపచోడవ్రం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, రాజమహేంద్రవరం ట్రాఫిక్ డి.ఎస్.పి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News