Breaking News

నగరంలో కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు విజ్ఞానాన్ని కల్పించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన నిర్వాకులకు సూచించారు.
నగరంలోని వన్ న్ లేబర్ కాలనీలో గ్రౌండ్స్ లో కాశ్మీర్ జలకన్య 2025 ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేసినేని శివనా చిన్ని కార్పొరేటర్లు పార్టీ నేతలతో కలిసి ఎగ్జిబిషన్లో లాంఛనంగా ప్రారంభించారు
అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన కాశ్మీర్ అందాలతో పాటు జలకన్యల అద్భుత విన్యాసాలను తిలకించి ఔరా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కేసీనేని చిన్ని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో మెగా డ్రోన్ షో, సీప్ లైన్ ను వంటి కార్యక్రమాలు ప్రారంభించి పశ్చిమ నియోజకవర్గానికి వన్నె తెచ్చారనీ అన్నారు. అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో అత్యద్భుతమైన ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ ఎగ్జిబిషన్ కాశ్మీర్ సోయగాలతో పాటు గుహల సౌందర్యాన్ని కళ్ళకు కట్టిన విధంగా అబ్బుర పరుస్తుందని పేర్కొన్నారు.. ఈ ఎగ్జిబిషన్ చిన్న పెద్ద తేడా లేకుండా కనువిందు చేస్తుందని తెలిపారు.
అనంతరం టిడిపి నాయకులు నాగుల్ మీరా మాట్లాడారు… టిడిపి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
అనంతరం మైలవరం రత్నకుమారి మాట్లాడుతూ… పశ్చిమ నియోజకవర్గం లో ఇటువంటి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరిని ఆహ్లాదపరుస్తుందని, ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్ వీక్షించి ఆనందించాలని కోరారు.
తదనంతరం నిర్వాహకులు రాజా రెడ్డి, కోటి రెడ్డి, షన్మి ఖాన్, అడపా ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ… ఎగ్జిబిషన్ లో కనీవినీ ఎరుగని రీతిలో సరి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే జలకన్య ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతుందన్నారు . .అంతే కాకుండా జెయింట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డ్యాన్స్, చిన్న పిల్లల ఆటవస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు, అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటూ ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.నగర వాసులు తప్పక ఎగ్జిబిషన్ ను సందర్శించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *