-భూసేకరణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రైతులకు నష్ట పరిహారాన్ని అందించి సకాలంలో భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టరేట్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నాయుడుపేట, తూర్పు కనుమూరు 6 లైన్ జాతీయ రహదారుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
శుక్ర వారం స్తానిక కోట మండలం నందు apco క్యాంప్ కార్యాలయంలో నాయుడుపేట తూర్పు కనుపూరు 6 లైన్ జాతీయ రహదారుల నిర్మాణం, గ్రీన్ ఫీల్డ్ ఎస్ప్రెస్ వే, ఫోర్ట్ కనెక్టీవీటి ప్రాజెక్ట్స్ పై గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, నెల్లూరు నేషనల్ హైవే పి డి చౌదరి, నేషనల్ హైవే, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నాయుడుపేట, తూర్పు కనుమూరు 6 లైన్ జాతీయ రహదారుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని అన్నారు. నాయుడుపేట తూర్పు కనుపూరు 6 లైన్ జాతీయ రహదారుల నిర్మాణం, గ్రీన్ ఫీల్డ్ ఎస్ప్రెస్ వే, ఫోర్ట్ కనెక్టీవీటి ప్రాజెక్ట్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు. రహదారుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ఇరిగేషన్ , రివెన్వు, పోలీస్ శాఖ అధికారులు సహకరించాలని అన్నారు.
ఈ సమావేశంలో సైట్ ఇంజనీర్ వేణుగోపాల్, కోట, చిల్లకూరు, ఓజీలి, నాయుడు పేట జె జె రావు, శ్రీనివాసులు, పద్మావతి, రాజేంద్ర, ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు, కోట ఎస్ ఐ పవన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News