-జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని కల్లు గీత కార్మికులకు ఉప కులాల ప్రాతిపాదికన రిజర్వు చేయబడిన మద్యం షాపుల కేటాయింపును ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత, ఉప కులాల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా పూర్తి చేయడమైనదని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు ప్రభుత్వం వారు ఎక్సైజ్ శాఖ ద్వారా కల్లు గీత కార్మికులకు ఉప కులాల ( గౌడ , గౌడు, ఈడిగ, గౌండ్ల ) ప్రాతిపాదికన రిజర్వు చేయబడిన మద్యం షాప్ ల కేటాయింపు లాటరీ ప్రక్రియను గీత, ఉప కులాల ప్రతినిధుల సమక్షంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్వహించడం జరిగింది.
ఇందులో కల్లు గీత కార్మికుల ఉప కులాలకు తిరుపతి జిల్లాలో 23 మద్యం షాపులు ప్రభుత్వం రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మద్యం షాపులను సదరు గీత కులాలకు లాటరీ పద్ధతి ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ అందరి సమక్షంలో జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కేటాయించడం జరిగింది. ఇందులో గౌడ్ కులానికి 3, ఈడిగ కులానికి 15, గౌడ కులానికి 2, గౌండ్ల కులానికి 3 మద్యం షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగింది. ఇందులో నగరపాలక సంస్థ పరిధిలో 1, మున్సిపాలిటీ పరిధిలో 6, మిగిలినవి 16 మండలాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా విజయ శేఖర్, జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నాగ మల్లేశ్వర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్ర శేఖర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News