Breaking News

ఓటు హక్కు పొందడం, ఓటు వేయడం మనందరి బాధ్యత కావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు పొందడం, ఓటు వేయడం మనందరి బాధ్యత కావాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లాస్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు అందరికీ ఓటు హక్కు లేదని, అయితే స్వాతంత్రానంతరం 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పడిందని, అందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు వేయడం పట్ల అవగాహన కల్పించే అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల, గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 65% పోలింగ్ నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 85% వరకు, మన జిల్లాలో 87 శాతం పోలింగ్ నమోదయిందన్నారు.

మనం ప్రాథమిక హక్కుల కోసం పోరాడినట్లుగానే ఓటు వేయడం మన ప్రాథమిక హక్కుగా ప్రతి ఒక్కరు గుర్తించాలని అన్నారు. ప్రస్తుతం ఓటర్ల డేటా ప్రకారం ఇవ్వ ఓటర్ల శాతం తక్కువగా ఉందని దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు కావున 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యతగా గుర్తించాలన్నారు. మనం ఈరోజు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రతిజ్ఞ చేశామని, మనం చేసిన ప్రతిజ్ఞ మనం అమలు చేయడం మర్చిపోవద్దని అన్నారు.

డి ఆర్ వో కె చంద్రశేఖర రావు మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. మన ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే మన దేశం గొప్పతనం తెలుస్తుందని, రాజ్యాంగ నిర్మాతలు అంత పకడ్బందీగా రచించారన్నారు. గతంలో 25 సంవత్సరాలకు, ఆ తదుపరి 21 సంవత్సరాలకు, ప్రస్తుతం 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పిస్తున్నారని అన్నారు. ఆధార్ మాండేటరీ ఎలాగో, ఓటు హక్కు అలాగే పొందాలన్నారు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకుంటే ఓటర్ కార్డు ఇంటికే వస్తుంది అన్నారు. ప్రతి ఇంటిలో అర్హత గల వారందరూ ఓటు హక్కు పొందాలని సూచించారు.

బందరు ఆర్డిఓ కే స్వాతి మాట్లాడుతూ అడ్వాన్సుగా 17 సంవత్సరాల నిండిన వారుకూడా ఓటరుగా నమోదు కావచ్చని, వీరికి 18 సంవత్సరాలు నిండిన రోజున ఓటర్ కార్డు ఇవ్వబడుతుందన్నారు. తొలుత జాయింట్ కలెక్టర్ ఓటరు దినోత్సవ ప్లెడ్జి చదివి అందరితో ప్లేడ్జీ చేయించారు.

భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించారు. సీనియర్ సిటిజన్ ఓటర్ వేమూరి రత్నగిరి రావు దంపతులను సత్కరించారు. కొత్త ఓటర్లకు ఓటర్ కార్డులు అందజేశారు.

వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్, మెమెంటో అందజేశారు.

అంతకుముందు నగరంలోని వివిధ కళాశాలలు పాఠశాలల విద్యార్థులచే స్థానిక లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని డిఆర్ఓ కె చంద్రశేఖర రావు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఓటు విలువ తెలుసుకో, ఓటు హక్కు మనందరి బాధ్యత వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమాల్లో డీఈవో పివిజే రామారావు, ఆర్ ఐ ఓ సాల్మన్ రాజు, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, డిప్యూటీ డిఇఓ శేఖర్ సింగ్, ఎం ఈ ఓ దుర్గాప్రసాద్, తాసిల్దార్లు నాగభూషణం మధుసూదన్ రావు, కలెక్టరేట్ ఏవో తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *