Breaking News

జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-సుస్థిర పర్యాటక అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపిన మంత్రి దుర్గేష్
-సమ్మిళిత, సమగ్ర వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి జరిగి తీరుతుందన్న మంత్రి దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సుస్థిర పర్యాటక అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. 25 జనవరి న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ మేరకు మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.. స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని తద్వారా పర్యాటకరంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందని తెలిపారు.. శాంతియుత, బాధ్యతాయుత పర్యాటకం నినాదంతో ఇటీవల ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకున్నామని, ప్రస్తుతం సమ్మిళిత, సమగ్ర వృద్ది దిశగా పర్యాటకం నినాదంతో జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు..సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో పర్యాటక రంగం పాత్రను నెరవేర్చేందుకు కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. పర్యాటకం పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించారని తదనుగుణంగా నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల చేశామని గుర్తు చేశారు.. ఇప్పటికే విజయవాడలో నిర్వహించిన టూరిజం సమ్మిట్ ద్వారా పెట్టుబడిదారులతో సమావేశమై ప్రతిపాదనలు స్వీకరించామన్నారు. త్వరలోనే విశాఖపట్నం, తిరుపతిలోనూ టూరిజం సమ్మిట్లు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు మంజూరు అయ్యాయని, పనులు కూడా ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *