-గన్నవరం ఎయిర్ పోర్ట్ లో మంత్రి నారా లోకేష్ కి ఎంపి కేశినేని చిన్ని స్వాగతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఐదు రోజుల పాటు దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసి రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఐటీ , విద్యాశాఖ మంత్రి లోకేష్ కు గన్నవరం విమానాశ్రయంలో ఎంపి కేశినేని శివనాథ్(చిన్ని) తో పాటు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఘనస్వాగతం పలికారు.
.దావోస్ పర్యటన ముగించుకొని విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం (25-1-2025) తెల్లవారుజామున 1:35 గంటలకు గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. దావోస్ పర్యటనలో పారిశ్రామిక వేత్తలను ఆకర్షించటంలో కీలక ప్రాత పోషించిన నారా లోకేష్ కి ఎంపి కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు
రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే సంకల్పంతో మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దావోస్ వెళ్లిన మంత్రి నారా లోకేష్ తన పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చారు. ఈ పర్యటనలో మంత్రి నారా లోకేష్ ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలకు, పలు సంస్థల సీఈవోలకు ఏపీలో అనుకూలతలను వివరించి రాష్ట్రానికి ఆహ్వానించారని ఎంపి కేశినేని శివనాథ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
Prajavartha Online Telugu News