Breaking News

ప్రభుత్వం గీత వృత్తిదారులకు కేటాయించిన 10% రిజర్వేషన్‌ మద్యం షాపుల విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం!

-జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం గీత వృత్తిదారులకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌ మద్యం షాపుల విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం జరిగిందని జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్‌ అన్నారు. ఆదివారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో మోర్ల ఏడుకొండలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం జీవో.ఎంఎస్‌.నెం.210, 211, 212, 213 గీత వృత్తిదారులకు మద్యం షాపుల రిజర్వేషన్‌లో 10 శాతం కల్పించే విధంగా ప్రకటించడం దానిలో గౌడ కులస్థులకు 50 శాతం ఫీజు సబ్సిడీ ప్రకటించడం హర్షనీయమని దీనికి గౌడ సంఘం జెఎసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అయితే జీవో.నెం.16 ప్రకారం గౌడ అనగా ఉపకులాలు అయినటువంటి గౌడ, శెట్టిబలిజ, శ్రీసైన, ఈడిగ అను నాలుగు కులాలు ఒకే గౌడ కులంలో వుండగా వీరి అందరికీ గీత వృత్తి పై ఆధారపడి వున్నందున వీరి అందరికి అవకాశం కల్పించడం కాదనలేమన్నారు. అయితే జీవో.నెం.16లో వున్న గౌడ కులాన్ని గౌడ, గౌళ్ళ, గౌముళ్ళ, గౌడ్‌ అని ప్రాంతాల వారీగా ప్రభుత్వం మద్యం షాపుల టెండర్లతో పొందుపరచడం గౌడ బిడ్డలు అయోమయంలో వున్నారన్నారు. ఇక్కడ మేము కోరుకునేది, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గౌడ సంఘం జెఎసి కోరుకునేది గౌడ, గౌళ్ళ, గౌముళ్ళ గౌడ్‌, కలాలి అందరు గౌడ్‌ కులం క్రిందకు వస్తారు. అది గౌడ సంఘాల జెఎసి తెలియజేస్తూ ఇది ప్రభుత్వం అధికారులు గమనించి మా గౌడ కులానికి సంబంధించి పై పొందుపరిచిన కులాల పేర్లుతో వచ్చిన అప్లికేషన్స్‌ తీసుకోవాలి అని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మురళీగౌడ్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.రంగారావు, మోర్ల కామేష్‌గౌడ్‌, వి.రామకృష్ణగౌడ్‌, పి.బ్రహ్మమ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *