Breaking News

నగరంలో 7వ డివిజన్ చిలకలపూడిలో పారిశుద్ధ్యన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం ఉదయం 1, 7వ డివిజన్లో పర్యటించి పారిశుద్ధ్యం పరిస్థితులు పరిశీలించారు. చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ డోర్ టు డోర్ పర్యటించి ఇళ్ల యజమానులు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో హౌస్ హోల్డ్ అందరికీ అవగాహన కల్పించాలని మునిసిపల్ సిబ్బందికి సూచించారు. నగరంలో ప్రతి షాపు ముందు తడి /పొడి చెత్తలు వేయుటకు 2 డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసుకోవాలని, తడి, పొడి చెత్తలను వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు.

చెత్త ఎక్కడపడితే అక్కడ పడకుండా డస్ట్ బిన్స్ ఉపయోగించాలని షాపుల యజమానులకు సూచించారు. ప్రతి షాపుల వద్ద నుండి శానిటేషన్ సిబ్బంది వాహనాలలో చెత్తను సేకరించి తరలిస్తారని తెలిపారు. నగరంలో నిర్మించిన డ్రైన్లు అక్కడక్కడ కనెక్టివిటీ లేదని, డ్రైన్ల గ్యాప్ లు అన్ని కనెక్ట్ చేసే పనులు చేపట్టాలన్నారు. బందరు ఆర్డిఓ కే స్వాతి, నగర పాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *