Breaking News

నగర ప్రజల జీవనోపాధి కొరకు సిటీ లైవ్లీహుడ్ మిషన్

-ప్రణాళిక కోసం నిపుణులతో సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా నిపుణులను ప్రణాళికలు సిద్ధం చేయమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో కేంద్ర ప్రభుత్వం వారి నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ 2.0 పథకంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ (NI MSME) నిపుణులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా వారికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలంటూ నిపుణులైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ ను ఆదేశించారు. అందులో భాగంగా అవసరమైన నైపుణ్య శిక్షణ, షెల్టర్ హోమ్ తదితర అంశాలు ఒక నెల గడువు ఇస్తూ క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను సమర్పించాలన్నారు. నివేదిక అనుగుణంగా నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా సిటీ లైవ్ లీ హుడ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రజల ఆర్థిక పురోగతిని సాధించవచ్చు అని తెలిపారు. ఈ సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, అసిస్టెంట్ ఫ్యాకల్టీ మెంబర్ సాయి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *