Breaking News

లారీ ఓనర్స్ రోడ్డుభద్రతా ర్యాలీలో కలెక్టర్, కమిషనర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రోడ్డు భద్రతా ర్యాలీని విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులకు మునుపెన్నడూ లేని విధంగా అవగాహన కల్పిస్తున్నామని, హెల్మెట్, సీటుబెల్టు వాడకం తప్పనిసరి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఎ. మోహన్ మాట్లాడుతూ మానవతప్పిదాల వల్లే రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

విజయవాడలోని బెంజిసర్కిల్ దగ్గర లారీ ఓనర్స్ హాలు నుండి బందరురోడ్డు పి.డబ్ల్యు.డి.గ్రౌండ్ వరకు జరిగిన రహదారి భద్రతా పాదయాత్రలో లారీ ఓనర్ల సంఘం అధ్యక్షులు నాగుమోతు రాజా, ప్రధాన కార్యదర్శి అల్లాడ సత్యనారాయణ, కార్యదర్శులు రవి శరత్ బాబు, చెన్నుపాటి వినయ్, మాజీ ప్రధాన కార్యదర్శి చెన్నుపాటి వజీర్, లారీ ఓనర్స్ కో ఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్ష కార్యదర్శులు కె.వి. రమేష్, కోనేరు జగదీశ్వరరావు, ఫౌండేషన్ అధ్యక్షులు రావి గోపాలరావు, రాష్ట్ర లారీ ఓనర్ల సంఘం పాలకవర్గ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు, నలంద కాలేజీ ఎన్.సి.సి. విభాగం విద్యార్థులు, అంపాపురం మోడల్ డ్రైవింగు స్కూలు ట్రెయినీలు పాల్గొన్నారు.

పి.డబ్ల్యు.డి. గ్రౌండ్ దగ్గర ర్యాలీ ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రహదారిని వినియోగించుకునే పౌరులు విధిగా రోడ్డుభద్రతా నియమాలు పాటించి ప్రమాదాలు నివారించాలన్నారు. జిల్లా కలెక్టర్ ను లారీ ఓనర్ల సంఘం అధ్యక్షులు నాగుమోతు రాజా, ప్రధాన కార్యదర్శి అల్లాడ సత్యనారాయణ శాలువాతో సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *