Breaking News

హెల్మెట్ తో డ్రైవ్ చెయ్యండి- సురక్షితంగా ఇంటికి వెళ్ళండి

-బైక్ ర్యాలీని ప్రారంభించిన డిటిసి ఏ మోహన్ డిసిపి కృష్ణమూర్తి నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని, ప్రమాదాలు తగ్గించే దిశగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీటీసీ ఎ. మోహన్, డీసీపీ కృష్ణమూర్తి నాయుడు అన్నారు.

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా పోలీసు శాఖల ఆధ్వర్యంలో మంగళవారంనాడు బైక్ ర్యాలీ ని డీటీసీ ఎ. మోహన్, డీసీపీ కృష్ణమూర్తి నాయుడు ప్రారంభించారు. బందర్ రోడ్ లోని డిటిసి కార్యాలయం నుండి మొదలై పోలీస్ కంట్రోల్ రూమ్ మీదగా బెంజ్ సర్కిల్ మరల డిటిసి కార్యాలయం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిసి మోహన్ మాట్లాడుతూ ప్రజలలో హెల్మెట్ పై పూర్తి అవగాహన కల్పించేందుకు రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా పోలీసు, రవాణాశాఖ అధికారులతో సంయుక్తంగా బైక్ ర్యాలీ ని నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వలన జరుగుతున్నాయని, జాగ్రత్తలు తీసుకోకపోవడమే అందుకు కారణమని ఆయన అన్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం సురక్షితం కాదని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద తీవ్రతను పెంచి ప్రాణనష్టం కలిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపొద్దని డీటీసీ చెప్పారు.

డీసీపీ కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ కార్లు ద్విచక్ర వాహనాలు నడిపే వాహన చోదకులు సీటు బెల్టు హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా పోలీసు రవాణాశాఖ సంయుక్తంగా బైక్ ర్యాలీని నిర్వహించామన్నారు. హెల్మెట్ వాడకంపై పూర్తి అవగాహన కలిగి బాధ్యత ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించని కారణంగా నిండు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలన్నారు. వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని
హెల్మెట్ ధరించిన వారిపై కేసుకు జరిమానాలు విధించడం జరుగుతాయని ఆయన అన్నారు. స్వచ్చంద సంస్థలు కూడా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు.

ఆర్టీఓ అధికారులు నిర్వహించిన బైక్ హెల్మెట్ ర్యాలీ లో ఏడిసిపి(ట్రాఫిక్) ఏ.వి.ఎల్ ప్రసన్నకుమార్, ఇంచార్జ్ ఆర్టీఓలు ఆర్ ప్రవీణ్, కె. వెంకటేశ్వరరావు, మోటార్ వాహన తనిఖీ అధికారులు కె. శివరాం గౌడ్, ఉదయ్ శివప్రసాద్, జీవి ఎస్ ఎన్ మూర్తి, రవాణా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *