Breaking News

సుజనా చౌదరి ఆదేశాలతో ఉచితంగా మందుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పాల ఫ్యాక్టరీ సమీపంలోని 46 వ డివిజన్ కు చెందిన మంత్రి విజయలక్ష్మి కు 7000 వేల రూపాయల మందులను ఉచితంగా అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన విజయలక్ష్మి నరాల సంబంధిత వ్యాధికి గురై మందుల కొనుగోలుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని 46 వ డివిజన్ టిడిపి మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మందులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సుజనా ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మంగళవారం ఎన్డీయే కార్యాలయంలో బాధితురాలి భర్త దుర్గారావుకు సుమారు 7000 రూపాయల మందులను ఉచితంగా అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కూటమి నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *