Breaking News

సోలార్ పవర్ తో కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పీ ఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం గురించి మంగళవారం సబ్ కలెక్టర్ కావూరి చైతన్య  రెవెన్యూ మరియు విద్యుత్తు శాఖల సిబ్బందితో ర్యాలీ నిర్వహించినారు ఈ ర్యాలీలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 33 వ డివిజన్ బి ఆర్ టి ఎస్ ఎన్ఆర్పి రోడ్డు నుండి శివాలయం రోడ్డు మీదగా భగత్ సింగ్ రోడ్డు గవర్నమెంట్ వరకు స్లొగన్స్ చెప్పుకుంటూ బ్యానర్లతో ఫ్లకార్డ్ లతో కరపత్రాలు పంచుతూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యుత్ వినియోగదారులకు సోలార్ పవర్ తో కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన కల్పించినారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చు సబ్సిడీ గురించి వివరించారు. మూడు కిలోవాట్స్ సోలార్ పవర్ పెట్టుకొనే వినియోగదారులకు సుమారు 1,90,000 నుండి 2 లక్షల వరకు ఖర్చు అవుతాయని మరియు అత్యధికంగా 78,000 వరకు సబ్సిడీ పొందవచ్చు అని చెప్పి ఉన్నారు. మిగతా రుణమును బ్యాంకుల ద్వారా ఏడు పర్సెంట్కే లోన క్రింద పొందవచ్చు అని చెప్పి ఉన్నారు. ఈ సోలార్ పవర్ పెట్టుకోవడం వల్ల వన్ కిలోవాట్ కి సరాసరిన రోజుకి నాలుగు నుండి ఐదు యూనిట్లు జనరేట్ అవుతాయని చెప్పియున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎం సూర్యఘర్ పథకం క్రింద సోలార్ పవర్ పెట్టించుకున్న ముత్యాలంపాడు చల్లపల్లి రోడ్డులోని యుద్దనపూడి శ్రీవిద్య ఇంటికి వెళ్లి అభినందించారు. కావున ఈ పథకమును ప్రజలందరూ వినియోగించుకోవలసిందిగా కోరి ఉన్నారు. ఈ పథకమును రిజిస్టర్ చేసుకోవాలంటే www.pmsuryaghar.gov.in వెబ్సైట్ లేదా పీఎం సూర్య ఘర్ యాప్ లో రిజిస్టర్ అవ్వాలని చెప్పియున్నారు. ఎవరికైనా అనుమానాల నివృత్తి కోసం దగ్గర్లోని సచివాలయముకు గాని విద్యుత్తు శాఖ కార్యాలయం గాని వెళ్లవలసిందిగా కోరి ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి మరియు తెలుగుదేశం నాయకులు గార్లపాటి విజయకుమార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి నార్త్ మరియు సెంట్రల్ తహసిల్దార్లు మరియు వారి సిబ్బంది, సచివాలయ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది ,విద్యుత్ శాఖ నుండి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ D2 సబ్ డివిజన్, విజయవాడ, మరియు గవర్నర్ పేట, గాంధీ నగర్, ముత్యాలంపాడు, మధురానగర్ ఏఈలు మరియు వారి సిబ్బంది పాల్గొని ప్రజలందరికీ అవగాహన కల్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *