విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ క్వాలిటీ అస్సూరెన్స్ (యన్ క్యూఏ) ప్రమాణాలు మేరకు ఆసుపత్రుల అభివృద్ధి పనులు ఉండాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) యల్. శివశంకర్ చెప్పారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లాలో అభివృద్ధి పరుస్తున్న ఆసుపత్రుల పనుల పురోగతిపై సంబంధి తాధికారులతో జెసి శివశంకర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 92 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిలో భాగంగా 10 పిహెచ్ సిలకు క్రొత్త భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని వాటి ప్రగతితీరునుఆయన సమీక్షించారు. మరో 80 పిహెచ్ సిల ఆధునికీకరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రెండు పిహెచ్ సిలకు సంబంధించి భూమి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గుడివాడ, నూజివీడు ఏరియా ఆసుపత్రులకు క్రొత్త భవనాల నిర్మాణ పనులు, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు క్రొత్త భవనాల పనులు ప్రారంభం, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అంతేకాకుండా జిల్లాకు మణిహారంగా నిలిచే మచిలీపట్నం వైద్యకళాశాల నిర్మాణపనులు పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో ఆర్ అండ్ బి యస్లీ వెంకటేశ్వర్లు, ఏయంయడిసి ఇఇ ప్రవీణ్ రాజ్, డిసిహెచ్ యస్ డా. జ్యోతిర్మణి, జిల్లా ఆరోగ్య నాణ్యతా ప్రమాణాల అధికారి డా. చైతన్యకృష్ణ, గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ, నూజివీడుల డిప్యూటి డియం హెచ్ఓలు డా. వంశీ, డా. శర్మిష్ఠ, డా. జె. ఉషారాణి, డా. ఆశాలత, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …