Breaking News

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి

-రాష్ట్రంలో రక్షణ రంగంలో పెట్టుబడులకు విస్తారంగా అవకాశాలు
-ముఖ్యమంత్రికి సతీష్ రెడ్డి ప్రజెంటేషన్
-ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నరని వెల్లడి
-పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతామన్న చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పెద్దఎత్తున పరిశ్రమలు స్థాపించేలా కృషి చేస్తున్న డీఆర్‌డీవో మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను, ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సంబంధించి ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రస్తుతం 50 మంది ఔత్సాహిక పారిశ్రమికవేత్తలతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేలా సహకారం అందిస్తానని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు కావాలని కోరగా… దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతం పలుకుతామని, సత్వర అనుమతులతో సహా అవసరమైన మౌలిక సదుపాయాలు, భూకేటాయింపులు చేస్తామని డాక్టర్ జి సతీష్ రెడ్డికి ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్, అమలాపురం లోక్‌సభ సభ్యుడు హరీష్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికీ చెందిన తంగెళ్ళ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల కేటగిరి కింద గృహ నిర్మాణం చేపట్టడం కోసం రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికీ చెందిన తంగెళ్ళ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *