విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ అభయ హస్త సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా యన్.టి.ఆర్.జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు..అనంతరం అభయ హస్త అయ్యప్పస్వామి వారి జన్మదిన వేడుకలలో అవినాష్ పాల్గొని పూజలు నిర్వహించి ఆ స్వామి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు ,ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు..
