-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను స్వయంగా తానే పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గులాబీ తోటలో ఉన్న అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూలైన్లో టోకెన్ తీసుకుని, టిఫిన్ లో ఆహార నాణ్యతను పరిశీలించారు. అన్న క్యాంటీన్లో ఆహారం తీసుకుంటున్న ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ, అక్కడున్న వసతులు బాగున్నాయా, టోకెన్లు అందరికీ అందుతున్నాయా, సరైన సమయానికి అన్న క్యాంటీన్ తెలుస్తున్నారా, పరిశుభ్రత ఎలా ఉంది వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కమిషనర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ శుభం నొకవల్, సిబ్బంది పాల్గొన్నారు.
