విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల యొక్క ఫిర్యాదులు మరియు సమస్యలు పరిష్కరించు నిమిత్తము మంగళవారం (18-03-2025) మ.12.00 డి.యస్.వి.ఆర్. మూర్తి (IPOS), పోస్ట్ మాస్టర్ జనరల్, విజయవాడ రీజియన్, విజయవాడ వారిచే తపాలా ఆదాలత్ నిర్వహించబడును. తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు సమస్యలు ఈ అదాలత్ నందు పరిష్కరించబడును. తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులు తేది: 17-03-2015 లోగా “తపాలా అదాలత్” శీర్షికతో అసిస్టెంట్ డైరక్టర్ (స్టాప్), పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం, గాంధీనగర్, విజయవాడ- 520003 అను చిరునామాకు పంపవలసినదిగా కోరడమైనది. పిర్యాదు దారులు వ్యక్తిగతంగా కూడా హాజరు కావొచ్చునని పోస్ట్ మాస్టర్ జనరల్ వారు తెలిపారు.
