విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57, 60, 61వ డివిజన్ లలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ జరిగింది. 60వ డివిజన్ వాంబే కాలనీలోని 262 వ వార్డు సచివాలయం, 57వ డివిజన్ లోని 233వ వార్డు సచివాలయాలలో కార్యక్రమ నిర్వహించారు. 57వ డివిజన్ లో 22 మంది, 60 వ డివిజన్ లో 9 మంది, 61వ డివిజన్ లో 5 మంది అర్హులకు నూతన పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక విజయవాడ నగరంలో 22 వేల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీపై టీడీపీ కావాలనే లేనిపోని రాద్ధాంతం చేస్తోంద న్నారు. తెలుగుదేశం హయాంలో వారాల తరబడి పింఛన్లు ఇస్తూనే ఉండేవారు.. లబ్ధిదారులు పింఛన్లలో సగభాగం ఆటోలకే ఖర్చు చేయాల్సి వచ్చేదన్నారు. పెన్షన్ల పంపిణీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు సరళీకృతం చేశారన్నారు. వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా ఇళ్లకే పింఛన్లు అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తొలి మూడు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నామన్నారు.కొత్తగా దరఖాస్తు చేసుకునే వారిని శాచ్యురేషన్ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. వార్డు సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు. సచివాలయానికి వచ్చే ఏ ఒక్కరూ నిరుత్సాహంతో వెనుదిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా దిశ యాప్ బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు శ్రీమతి ఉమ్మడి రమాదేవి, శ్రీమతి ఇసరపు దేవి, మరో కార్పొరేటర్ బాలి గోవింద్, నాయకులు బెవర నారాయణ, ఉమ్మడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.