Breaking News

ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి  పాలన… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు


-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. 7.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పాలన సాగిస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7 లక్షల 41 వేలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 718 మందికి రూ. 3 కోట్ల 42 లక్షల 52 వేల 35 రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో చేయూతనందిస్తోందన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ విషయంలో చాలా అలసత్వం ఉండేదని.. జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తరువాత సీఎం రిలీఫ్‌ ఫండ్‌ విషయంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ.. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలవ‌డంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  కృషి మరువలేనిదని  మ‌ల్లాది విష్ణు  అన్నారు. 2,434 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తుండ‌టంతో పాటు.. చివరకు కరోనాను కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌ వైద్య రంగానికి కేటాయింపులు పెంచార‌ని మల్లాది విష్ణు తెలిపారు. ఆస్పత్రులకు బకాయిలను సైతం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వాలు చేయ‌ని విధంగా.. ముఖ్యమంత్రి జగన్మోహ‌న్ రెడ్డి  రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, చిన్న పిల్లలకు సంబంధించిన ఆస్ప‌త్రుల ఏర్పాటు, నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి పరుస్తున్నారన్నారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మల్లాది విష్ణు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు  ఉద్దంటి సునీత సురేష్,  కుక్కల అనిత రమేష్,  అలంపూర్ విజయలక్ష్మి,  పెనుమత్స శిరీష,  షాహినా సుల్తానా,  మోదుగుల తిరుపతమ్మ,  బంకా శంకుతల, బాలిగోవింద్, కొంగితల లక్ష్మీపతి, వైఎస్సార్ సీపీ నాయకులు గుండె సుందర్ పాల్, అవుతు శ్రీనివాసరెడ్డి, బెవర నారాయణ, అలంపూర్ విజయ్, బంకా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *