Breaking News

ప్రజలు సమస్యల పరిష్కార వేదిక స్పందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీల‌ను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. విజ‌య‌వాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమములో మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి స్వయంగా ప్రజల నుంచి అర్జీల‌ను స్వీకరించారు. ప్ర‌జ‌లు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -4, పబ్లిక్ హెల్త్ – 1, యు.సి.డి – 5, ఇంజనీరింగ్ – 5, పేషి రిమర్క్స్ -2 మొత్తం 17 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు. స్పందన కార్యక్రమములో ప్రజల నుండి వచ్చిన సమస్యల అర్జిలను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్, ఏ.డి.హెచ్. జె.జ్యోతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *