-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్ కళాశాలలు)ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా తీర్చిదిద్దేందుకు రెండో విడతలో భాగంగా రూ. 43.22 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. మౌలికసదుపాయాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. 2028 నాటికి రాష్ట్రంలో 13 డైట్లను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు.