విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా ఆదివారం విజయవాడ ఆటోనగర్‌లోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబు కి శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు శ్రేణులకు పంచిపెట్టారు
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సమకాలిన భారత రాజకీయాల్లో మేరునగ ధీరుడు 75 సంవత్సరాల జీవిత ప్రస్థానం, 46 సంవత్సరాల రాజకీయ ప్రస్తానం ఆయన సొంతం, ఈనాటి భారత రాజకీయాల్లోనే ఎన్నదగిన వ్యక్తి, ఒక రాష్ట్ర రాజకీయాలే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకు ఆయనే శాటి, చాలా సుదీర్ఘమైన అనుభవం, సుదీర్ఘ కాలం ప్రజల్లో మమేకమైన పనిచేసిన తీరు ఇలాంటి వ్యక్తిని పోల్చబడిన వ్యక్తి మరొకరు అతి తక్కువ మంది కనపడతారు.
ఇప్పటి మనం చూశాం ఎన్నో ఒడిదుడుకులను ఆయన ఎదుర్కొన్నారు, సామాన్యమైన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి తన స్వశక్తి మీద ఆయనకున్న అనుభవం ద్వారా ఇంతటి గొప్పటి కీర్తిని పొందటమనేది చరిత్రలో లిఖిందగ్గ విషయం. గొప్ప దార్శనీకుడు, ఒక విజన్ ఏ విధంగా ప్రజలకు లబ్ధిచేకూరిందనేది సైబరాబాద్ సిటీ నిర్మాణమే మనకి సాక్ష్యమన్నారు.
ఈనాడు తెలంగాణ ప్రజలకి ఒక పట్టుకొమ్మగా, ఒక వరంగా హైదరాబాద్, సైబరాబాద్ తీర్చిదిద్దంటే చంద్రబాబు యొక్క దూరదృష్టికి నిదర్శనం మనకు కనపడుతుంది. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఓటమి, గెలుపు మరి ఆయన ఈ 46 ఏళ్లలో ఎవరికీ కూడా అలాంటి అనుభవాలు లేవు, ఎప్పుడు ఓటమి సంభవించినా మళ్లీ నిరంతరమైన పరిశ్రమ ద్వారా మళ్లీ పైకి రావటమనేది చూశాం,
ఆయన కళ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేకూర్చాలని, 2029 కల్లా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కావాలి, 2004లో నిలిచిపోయిన స్వర్ణాంధ్రప్రదేశ్, 2019లో మళ్లీ వేగం మళ్లీ రెండోసారి కూడా అవరోధం కలిగింది, కానీ నేడు చంద్రబాబు చాలా నమ్మకంగా ముందుకెళ్తున్నారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతోటి, కూటమి పార్టీల సహకారంతోటి అతి సత్వరం పేద ప్రజల యొక్క ఆర్థిక అభ్యున్నతికి ఆయన కంకణం కట్టుకుని ముందుకువెళ్తున్నారు.
వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంద్రప్రదేశ్ చేయాలని 2047 కల్లా తలసరి ఆదాయాన్ని 50లక్షలకు తీసుకెళ్లాలని ఆయన యొక్క ఆకాంక్ష, గతంలో ఆయన చేసింది చూశాం, ఆ యొక్క నమ్మకంతోనే ప్రజలున్నారు, చంద్రబాబు ని మనం ఏమాత్రం అలక్ష్యం చేయకుండా రాబోయే పదేళ్లపాటు ఆయన్ని ముఖ్యమంత్రిగా స్థిరపరచుకోగలిగితే మన యొక్క కళలు, మన ఆకాంక్షలు, మన పిల్లల భవిష్యత్తు ఆయన చేతుల్లో సాకారం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 75వ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున నేను, పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలందరూ కూడా ఆయన్ను మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో జన్మదినం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామన్నారు.
ఈ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా గర్వంగా తలెత్తుకుని తిరగగలిగే విధంగా చేయగలిగిన ఒక సమర్థమైన, అవగాహన కల్గిన, దూరదృష్టి కలిగిన నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు ని జైల్లో వేసినప్పుడు ప్రపంచంలోని 80 దేశాల్లో ఆయన బయటకు రావాలని లక్షలాదిమంది జనం వచ్చినది మనం గుర్తుచేసుకుంటే ఆయనకి జనంలో ఎంతటి ఆదరణ ఉందనేది మనకు కనపడుతుందన్నారు.
మాజీ ఉడా చైర్మన్, సీనియర్ నాయకులు తూమాది ప్రేమనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ఆయన యొక్క జన్మదినం రాష్ట్ర ప్రజలకన్నా భావితరాలకు, యూత్, ఫ్యూచర్ జనరేషన్‌కి ఒక పర్వదినం, ఆయన చేసిన ఐటీ అభివృద్ధి ద్వారా ఒక పెద్ద ఉపాధి గని సృష్టించింది మనందరికీ తెలుసు. ఈరోజున అమరావతి నగర నిర్మాణంగాని, రాజధానిలో రాబోయే రానున్న క్రీడా సిటీ, టూరిస్ట్ సిటీ ఇవన్నీ భావితరాలకి ఉపాధి గనులు సృష్టించబడుతున్నాయన్నారు,
రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ఈ శతాబ్దపు అత్యున్నత నాయకుల్లో ఒకరైన మా నాయకుడు చంద్రబాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక మంచినాయకుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం యావత్తు, ప్రపంచంలో తెలుగుజాతి యావత్తు కూడా ఒక పండుగ వాతావరణం నెలకొనివుంది. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సాంకేతిక అభివృద్ధిని అందిపుచ్చుకుని తెలుగుజాతిని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దటం ఆయన ఒక్కడి వల్లే సాధ్యం, ఆయన ఆకాంక్షకు మనమందరం అండగా ఉండాలన్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.
రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఇది నాలుగో పర్యాయం, సంయుక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్‌ను నిర్మించారు, అలాగే నేడు విడిపోయిన మన ఆంధ్ర రాష్ట్రంలో మరో రాజధాని అమరాతిని నిర్మించటం జరుగుతుందన్నారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తూ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, నాయకులు యెర్నేని వేదవ్యాస్, మరుపిళ్ల తిరుమలేష్, సోలంకి రాజేంద్ర జైన్, పొన్నం రవికుమార్, గొల్లపూడి నాగేశ్వరరావు, ముక్కంటి నారాయణమ్మ, పామర్తి కిశోర్‌బాబు, చలసాని రమణ, కోడూరు ఆంజనేయవాసు, దేవరపల్లి ఆంజనేయులు, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, పాలడుగు దుర్గాప్రసాద్, కొనసాని నాగమణి, వల్లూరు సాంబశివరావు, జాస్తి సురేష్, ఎం సూర్యకుమారి, బోయిన సుబ్రహ్మణ్యం, బత్తుల దుర్గారావు, మన్నెం పోతురాజు మరియు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News