-టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం
-75 వసంతాల సందర్భంగా 75 కేజీల కేక్ ను కట్ చేసి చంద్రన్నకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మనుసుల్లో దేవుడు ప్రజల సేవకై పుట్టిన మహనీయుడు పేదల బాంధవుడు.. అభివృద్ధి ప్రధాత, స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, నవ్యాంధ్ర రథసారథి మన విజనరీ లీడర్ చంద్రన్న75వ పుట్టిన రోజు వేడుకులను నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఘనంగా నిర్వహించారు. ఆయన 75 వసంతాలను పురష్కరించుకొని చైర్మెన్ లు వీరంకి గురుమూర్తి, డూండీ రాకేష్ లు ఏర్పాటు చేసిన 75 కేజీల భారీ కేక్ ను కట్ చేసి ప్రజలందరి ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి కాదని ఆయన ఒక వ్యవస్థ అని.. అభివృద్ధి, సంక్షేమమే ఆయన ధ్యేయమని పేద బడుగు బలహీన వర్గాల సాధికారతే ఆయన లక్ష్యమని.. అటువంటి గొప్ప నాయకుడు ఆశయ సాధనకు అందరం కలిసి పని చేయాలని కోరారు. P4 సూత్రాన్ని ముందుకు తీసుకెళ్లి సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ఉన్నతి కోసం కేవలం నాలుగు గంటలు నిద్రిస్తూ.. 20 గంటలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి మన చంద్రబాబు నాయుడన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన చంద్రబాబు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఇటువంటి గొప్ప నేతకు తెలుగు ప్రజల ఆశీస్సులు ఉండి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలన్నారు. బాబుగారి అంకితభావం, దూరదృష్టి ఏపీని ప్రగతి పథంలో నడిపిస్తుందన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌కు బాటలు వేస్తున్న విజనరీ లీడర్ చంద్రన్న అన్నారు.. నాడు 2020 లక్ష్యంతో పని చేసి ఐటీకి హైదరాబాద్ ను హబ్ గా మార్చారు. నేడు విజన్ 2047 తో దేశంలోనే ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చడమే కాక.. జాతి గర్వపడేలా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అనంతరం చంద్రన్న పాలనలో జరిగిన సంక్షేమం అభివృద్ధిపై ఏర్పాటు చేసిన బ్యానర్ లను తిలకిస్తూ.. ఒక్కొక్కదాన్ని వివరిస్తూ నేతలు ముందుకు సాగారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మంత్రి అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎమ్మెల్సీలు వీవీవీ చౌదరి, ఏఎస్ రామకృష్ణ, చైర్మెన్ లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, వీరంకి గురుమూర్తి, హజ్ కమిటీ చైర్మెన్ హాజీ హసన్ బాషా, గుమ్మడి గోపాలకృష్ణ, గొట్టిముక్కల రఘురామరాజు నేతలు ఏవీ రమణ, బుచ్చి రాంప్రసాద్, కోమటి జయరాం, వందనాదేవి, కోవెలమూడి రవీంద్ర, పాతర్ల రమేష్, రాజశేఖర్, SP సాహెబ్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News